Drishyam 3 Day 1 Collections: 50 కోట్లకు చేరువగా దృశ్యం 3 కలెక్షన్లు.. మోహన్ లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Drishyam 3 Day 1 Expected Box Office Collections

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్‌ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దృశ్యం సీక్వెల్‌కు భారీ క్రేజ్ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ భారీ జరిగింది. ఈ సినిమా కేరళలో 8.5 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్ 12.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 22 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయల కలెక్షన్లను కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక దృశ్యం 3 సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ సినిమా తొలి రోజు కేరళలో రికార్డు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మలయాళంలో సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1 కోటి రూపాయలు, నార్త్ ఇండియాలో 1.5 లక్షలు, తెలుగులో 1.5 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది.. దాంతో ఇండియాలో ఈ చిత్రం 16.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మోహన్ లాల్ చిత్రానికి ఇండియాలో కంటే ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, గల్ఫ్ కంట్రీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఇతర దేశాల్లో ఈ చిత్రం సుమారుగా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 40 నుంచి 45 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేస్తున్నారు.

అయితే దృశ్యం 3 సినిమాకు నైట్ షోలకు డిమాండ్ పెరిగితే.. ఈ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలా జరిగితే.. ఈ సినిమా కలెక్షన్లు 50 కోట్ల వరకు టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X