Drishyam 3 Day 10 Box Office: బాక్సాఫీస్ వద్ద మోహన్‌లాల్ మ్యాజిక్.. దృశ్యం 3 కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే!

Drishyam 3 Box Office Collections: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3'. ఇప్పటికే సంచలన విజయాలు సాధించిన 'దృశ్యం' ఫ్రాంచైజీలో మూడో భాగంగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మోహన్‌లాల్ సరసన మీనా కీలక పాత్రలో నటించగా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Also Read
ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవిపై నాని ఎమోషనల్
ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవిపై నాని ఎమోషనల్

ఈ సినిమాకు దృశ్యం, దృశ్యం 2 చిత్రాలను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోని పెరంబవూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా మే 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Recommended For You
ఎన్టీఆర్ డ్రాగన్ మరో ధురంధర్ కాబోతుందా? సీక్రెట్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్!
ఎన్టీఆర్ డ్రాగన్ మరో ధురంధర్ కాబోతుందా? సీక్రెట్ రివీల్ చేసిన ప్రశాంత్ నీల్!
Drishyam 3 Day 10 Expected Box Office Collections Worldwide mohanlal movie Eyes Rs 210 Crore Mark

మోహన్‌లాల్ నటించిన 'దృశ్యం 3' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమాకి బ్లాక్‌బస్టర్ ఆరంభం లభించింది. మొదటి రోజే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 15.85 కోట్ల నెట్ వసూలు చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు, ఆరో రోజు నాటికి రూ. 170 కోట్ల మార్కును దాటింది. దేశీయంగా కేరళ నుంచే అత్యధిక వసూళ్లు రాగా, గల్ఫ్, నార్త్ అమెరికా, యూరప్ వంటి ఓవర్సీస్ మార్కెట్లు కూడా భారీగా కలెక్షన్లు అందించాయి. ఈ సినిమా రికార్డుల ప్రయాణంలో అంతర్జాతీయ వసూళ్లు కీలక పాత్ర పోషించాయి.

You May Also Like
పెళ్లైన 8 నెలలకే బిగ్ బాస్ ఛాన్స్.. పెద్ద గొడవ.. మా ఆయనతో రాత్రంతా ..
పెళ్లైన 8 నెలలకే బిగ్ బాస్ ఛాన్స్.. పెద్ద గొడవ.. మా ఆయనతో రాత్రంతా ..

తాజా బాక్సాఫీస్ రిపోర్టుల ప్రకారం.. 9వ రోజు 'దృశ్యం 3' దేశవ్యాప్తంగా 2,524 షోల ద్వారా రూ.4.30 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. 8వ రోజు రూ.6.65 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. 9వ రోజుకు 35.3 శాతం డ్రాప్‌ను నమోదు చేసింది.ఇప్పటివరకు సినిమా సాధించిన మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.87.75 కోట్లకు చేరుకున్నాయి. అలాగే ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.100.08 కోట్ల మార్క్‌ను దాటాయి.

15 రోజులు కోమాలో.. చావు అంచుల వరకు వెళ్లొచ్చా..
15 రోజులు కోమాలో.. చావు అంచుల వరకు వెళ్లొచ్చా..

విడుదలైన కేవలం తొమ్మిది రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడం విశేషంగా చెప్పుకోవాలి. భాషల వారీగా చూస్తే మలయాళ వెర్షన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. మలయాళంలోనే అత్యధికంగా రూ.76.21 కోట్ల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా మంచి స్పందనను సొంతం చేసుకుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు రూ.6.95 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. తమిళ వెర్షన్ రూ.3.10 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.1.49 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టాయి.

ప్రభాస్ స్పిరిట్ తో పాటు మరో మూవీ.. సందీప్ వంగా ప్లానింగ్ మామూలుగా లేదుగా!
ప్రభాస్ స్పిరిట్ తో పాటు మరో మూవీ.. సందీప్ వంగా ప్లానింగ్ మామూలుగా లేదుగా!

అలాగే.. ఓవర్సీస్ మార్కెట్‌లోనే సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 9వ రోజు మాత్రమే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.6 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా..దీంతో ఓవర్సీస్ వసూళ్లు రూ.109 కోట్లకు చేర్చుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్లు రూ.209.08 కోట్లకు చేరుకున్నాయి. విడుదలైన తొమ్మిది రోజుల్లోనే 200 కోట్ల మార్క్‌ను దాటడంతో ఈ సినిమా భారీ విజయం సాధించిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల్లో 'దృశ్యం 3' ఒకటిగా నిలిచింది.

మా నాన్న కోరిక తీర్చలేకపోయా.. కార్తీక దీపం డాక్టర్ బాబు ఎమోషనల్
మా నాన్న కోరిక తీర్చలేకపోయా.. కార్తీక దీపం డాక్టర్ బాబు ఎమోషనల్

ఇక రెండో వీకెండ్ లో కలెక్షన్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుత పరిస్తితులను చూస్తే.. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 10వ రోజు రూ. 6 కోట్ల నుంచి 7 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముంది. దీంతో మొత్తం ఇండియా నెట్ కలెక్షన్లు రూ.95 కోట్లకు చేరుకోనున్నాయి. అలాగే ఇండియా గ్రాస్ వసూళ్లు రూ.110 కోట్లలకు చేరుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

చిరంజీవికి రామ్ చరణ్ చెప్పిన ఆ ఒక్క అబద్ధం.. చెర్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్?
చిరంజీవికి రామ్ చరణ్ చెప్పిన ఆ ఒక్క అబద్ధం.. చెర్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్?

అలాగే.. ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ రూ. 210 కోట్లు దాటే అవకాశముంది. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రెండో వీకెండ్‌లో సినిమా మళ్లీ పుంజుకుంటే.. త్వరలోనే రూ.250 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X