100 కోట్లకు చేరువగా దృశ్యం 3.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Drishyam 3 Day 3 Expected Box Office

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్‌ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దృశ్యం 3 సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌తో ముందుకెళ్తున్నది. ఈ సినిమా 250 పట్టణాల్లో 700 లోకేషన్లలో 1000 కి పైగా స్క్రీన్లలో సుమారుగా 4200 షోలు ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం తొలి రోజు ఇండియాలో 19 కోట్ల రూపాయల గ్రాస్ 16 కోట్ల నెట్, రెండో రోజున 13 కోట్ల రూపాయల గ్రాస్, 11 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో ఇండియాలో 27 కోట్ల రూపాయల నెట్, 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకొన్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా కేరళలో భారీగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం మలయాళంలో 11 కోట్ల రూపాయలు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 1.9 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలతో 2.9 కోట్లు, తమిళంలో తొలి రోజు 1.30 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలతో 2.3 కోట్ల రూపాయలు వసూలు వసూలు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం తొలి రోజు 2.8 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలతో 4.3 కోట్ల రూపాయలు రాబట్టింది. మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం స్వదేశంలో కంటే విదేశాల్లోనే భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం గల్ఫ్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్‌లో రికార్డు లెవెల్ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ చిత్రం 45 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 77 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

ఇక దృశ్యం 3 సినిమా మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియాలో సుమారుగా 7 నుంచి 9 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓవర్సీస్‌లో మరో 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. దాంతో ఈ చిత్రం వీకెండ్‌లో 9 నుంచి 12 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఈ చిత్రం 90 కోట్ల మేర వసూళ్లను 3 రోజుల్లో నమోదు చేసే అవకాశం ఉంది. తొలి వారాంతం ముగిసే సమయానికి ఈ చిత్రం 100 కోట్ల మైలురాయిని చేరుకొంటుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X