Drishyam 3 Box Office: బాక్సాఫీస్‌పై మోహన్ లాల్ జైత్రయాత్ర.. దృశ్యం 3 మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ను దృశ్యం 3 చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈ చిత్రం మందకోడిగా వసూళ్ల యాత్రను ప్రారంభించింది. తొలి రోజు 1.9 కోట్ల రూపాయలు, రెండో రోజు 1 కోటి రూపాయలు, మూడో రోజు 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం నైజాంలో 2.35 కోట్ల రూపాయలు, ఏపీలో 1.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 2 కోట్లకుపైగా షేర్, 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.75 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అంటే ఈ చిత్రం ఇంకా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది అని పేర్కొన్నారు.
కేరళలో ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 10 కోట్ల రూపాయల గ్రాస్, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, మూడో రోజు 8 కోట్ల రూపాయలతో 26 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కర్ణాటకలో 2.2 కోట్లు, 1.2 కోట్ల రూపాయలు, 1.9 కోట్ల రూపాయలతో 5.3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళనాడులో తొలి రోజు 70 లక్షలు, రెండో రోజు 50 లక్షల రూపాయలు, మూడో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. మహారాష్ట్రలో ఈ సినిమా భారీగానే కలెక్షన్లను రాబడుతున్నది. తొలి రోజు 65 లక్షలు, రెండో రోజు 40 లక్షలు, మూడో రోజు 70 లక్షలు వసూళ్లను సాధించింది అని అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
దృశ్యం 3 చిత్రం ఇండియా వైడ్‌గా భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 14 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం మూడు రోజుల్లో 36 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 106 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక దృశ్యం 3 సినిమాకు ఆదివారం కలిసి వచ్చేలా ఉంది. ఈ చిత్రం ముందస్తు అంచనాల ప్రకారం.. 4వ రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కేరళలో 5.5 కోట్లు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, మహారాష్ట్రలో 40 లక్షలు, తమిళనాడులో 40 లక్షల రూపాయలు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 120 కోట్ల రూపాయలకు చేరువ కానున్నది అని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications