Drishyam 3 Collections: 150 కోట్ల క్లబ్‌లో దృశ్యం 3.. ఓవర్సీస్‌లో మోహన్‌లాల్ మూవీకి రికార్డు కలెక్షన్లు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో పరుగులు పెడుతున్నది. మే 21వ తేదీన ఈ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట మంచి కలెక్షన్లతో 200 కోట్ల రూపాయల మార్క్ వైపు పరుగులు పెడుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్‌ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Drishyam 3 Day 5 Expected Expected Box Office

దృశ్యం ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా వచ్చిన ఈ సినిమా మలయాళంతోపాటు ఇతర భాషల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజు ఈ చిత్రం 18.5 కోట్ల రూపాయల గ్రాస్, 16 కోట్ల రూపాయల నెట్, రెండో రోజు 13 కోట్ల గ్రాస్, 11 కోట నెట్, మూడో రోజు 16 కోట్ల గ్రాస్, 14 కోట్ల నెట్, 4వ రోజు 16 కోట్ల గ్రాస్, 14 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాల వెల్లడించాయి.

ఈ సినిమా భాషల వారీగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో తొలి రోజు 11 కోట్లు, రెండో రోజు 9 కోట్లు, మూడో రోజు 9.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడ భాష విషయానికి వస్తే.. ఈ సినిమా 2.8 కోట్లు, రెండో రోజు 1.5 కోట్లు, మూడో రోజు 2.5 కోట్లు, నాలుగో రోజు 2.4 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక తెలుగు విషయానికి వస్తే.. ఈ చిత్రం మొదటి రోజు 1.9 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు, మూడో రోజు 1.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళనాడులో తొలి రోజు 1.3 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు, మూడో రోజు 1.45 కోట్లు, నాలుగో రోజు 1.4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 63 కోట్ల రూపాయల గ్రాస్, 54.5 కోట్ల నెట్ కలెక్షన్లన నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో అద్బుతమైన వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం విదేశాల్లో 78 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 141 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 5వ రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో 150 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు.

Read more about: Drishyam 3 mohanlal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X