Drishyam 3 Day 6 Box Office: మోహన్ లాల్ అరుదైన బాక్సాఫీస్ రికార్డు.. దృశ్యం 3 మూవీకి ఎన్ని కోట్లంటే?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

దృశ్యం 3 సినిమా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 100 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 300 కోట్లకుపైగానే జరిగిందిని ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఈ సినిమా రిలీజ్‌కు ముందే సుమారుగా 35 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూలు చేసింది. ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ తెచ్చేలా ప్రమోషనల్ కార్యక్రమాలు జరిగాయి.
ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ చిత్రానికి క్రిటిక్స్ టాక్ ప్రతికూలంగా మారలేదనే విషయం తాజా కలెక్షన్లతో స్పష్టమైంది. ఈ చిత్రం తొలి రోజు కేరళలో 11 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 1.9 కోట్లు, కర్నాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో 17.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ఈ చిత్రం రెండో రోజు కేరళలో 9 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 67 కోట్ల రూపాయలు రాబట్టింది.
దృశ్యం 3 సినిమా మూడో రోజు కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. ఇండియాలో కేరళతో కలిపి 17 కోట్లు, ఓవర్సీస్‌లో 24 కోట్లరూపాయలతో 41 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఈ చిత్రం కేరళలో 10 కోట్లతో కలిపి ఇతర రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 8 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 24.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపింది. మోహన్ లాల్ మూవీ 5వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రం ఐదో రోజు కేరళలో 6.65 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో కలిపి 8.7 కోట్ల వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 1.3 కోట్లు వసూలు చేసింది.
గత 5 రోజుల్లో కేరళలో 45 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 6 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, కన్నడలో 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 77 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. గత కొద్దికాలంగా వరుసగా తన సినిమాలను 150 కోట్ల మైలురాయిని దాటించిన హీరోగా రేర్ రికార్డును సొంతం చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications