Drishyam 3 Business: దృశ్యం 3 రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే మోహన్ లాల్ మూవీ లాభాల్లోకి..
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

స్టార్, టెక్నికల్ వాల్యూస్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు పెన్ స్టూడియోస్ సహ నిర్మాతగా మారింది. ఈ సినిమాలో నటించిన మోహన్ లాల్ రెమ్యునరేషన్ (20 కోట్ల రూపాయలు)తోపాటు ఈ చిత్రం సుమారుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సుమారుగా 350 కోట్ల రూపాయల బిజినెస్‌ను నమోదు చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం హిందీ రీమేక్స్ రైట్స్ అమ్మకం ఇండస్ట్రీలో రికార్డుగా మారింది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే పనోరమా స్టూడియోస్ బాలీవుడ్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించారనే విషయం ఇండస్ట్రీలో టాక్‌గా మారింది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు సుమారుగా 30 కోట్ల రూపాయలు చెల్లించి రైట్స్‌ను దక్కించుకొన్నదని ట్రేడ్ రిపోర్ట్. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే.. ఆసియానెట్ ఛానెల్ రికార్డు ధరకు ఈ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ధర 15 కోట్ల రూపాయలు పలికిందని కేరళ సినీ ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.
ఇక దృశ్యం సినిమా మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నేరుగా రిలీజ్ అవుతున్నది. గతంలో ఈ సినిమాను ప్రాంతీయ భాషల్లో రిమేక్ చేశారు. కానీ మోహన్ లాల్‌కు ఉన్న మార్కెట్‌ను బట్టి ఈ సినిమాను నేరుగా డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 375 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్‌ను నమోదు చేసుకొంటున్నది. రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే. దృశ్యం బాక్సాఫీస్ స్టోరీల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications