Drishyam 3 Business: దృశ్యం 3కి రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్.. షూటింగ్ పూర్తికాక ముందే ఎన్ని కోట్లంటే?
భారతీయ సినిమా పరిశ్రమలో అన్ని భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం దృశ్యం. ఇప్పటికే రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చింది. ఈ సీక్వెల్‌లో వస్తున్న మూడో చిత్రం దృశ్యం 3. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నది. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై మోహన్ లాల్ స్నేహితుడు ఆంటని పెరంబవూర్ నిర్మిస్తున్నారు.
దక్షిణాదిలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తోపాటు మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్దిఖీ, మురళీ గోపి, కేబీ గణేష్ కుమార్, శాంతి మాయాదేవీ తదితరులు నటించారు. ఈ సినిమాకు సతీష్ కురూప్ సినిమాటోగ్రఫి, అనిల్ జాన్సన్ మ్యూజిక్, వీఎస్ వినాయక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. 2026 సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

మలయాళ చిత్ర రంగంలో రికార్డు వసూళ్లు సాధించిన దృశ్యం సినిమాకు ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లతోపాటు ప్రతిభావంతులైన నటీనటులు నటిస్తున్నారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. మోహన్ లాల్ రెమ్యునరేషన్ మినహాయిస్తే.. ఈ సినిమాకు సుమారుగా 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మలయాళ సినీ రంగంలో దృశ్యం 3 చిత్రం రికార్డు బిజినెస్ నమోదు చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సుమారుగా 350 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకొన్నదనే విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొన్నది. ఈ సినిమా బిజినెస్ ఇండస్ట్రీలోనే టాప్ ట్రేడ్ అని నిర్మాత రంజిత్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా, దృశ్యం 3 సినిమా హిందీ రీమేక్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ముంబైకి చెందిన పనోరమా స్టూడియోస్ ఈ సినిమా రైట్స్‌ను దాదాపు 115 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకొన్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయిన తర్వాత రెండు నెలలకు ఇతర భాషల్లో రిలీజ్ కావాల్సి ఉంటుందనే నిబంధనతో రీమేక్ రైట్స్ అమ్మినట్టు సమాచారం.
ఇక దృశ్యం 3 సినిమా విషయానికి వస్తే.. మోహన్ లాల్ కెరీర్‌లో ఐకానిక్ క్యారెక్టర్ జార్జ్ కుట్టి పాత్రలో కనిపించబోతున్నారు. రాణి జార్జ్ పాత్రలో మీన, అను జార్జ్ క్యారెక్టర్‌లో ఎస్తేర్ అనిల్, అంజు జార్జిగా అన్సిబా హాసన్ తదితరులు నటించారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











