Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Friday Box Office: లవ్ టుడే పై తోడేలు యుద్ధం.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలంటే?
ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన భేడియా సినిమా తెలుగులో తోడేలు పేరుతో విడుదలవుతున్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న లవ్ టుడే సినిమాను దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల మధ్య కొంత పోటీ నెలకొంది. అయితే ఈ సినిమాలు మార్కెట్లో ఎంత బిజినెస్ చేశాయి? అలాగే బాక్సాఫీస్ వద్ద ఎంత వస్తే హిట్ అయినట్లు లెక్క! అనే వివరాల్లోకి వెళితే..

నరేష్ సినిమా బిజినెస్
ఈ శుక్రవారం చెప్పుకోదగిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమా ఒకటి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 390 పైగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 510 థియేటర్లో విడుదల చేస్తున్నారు. ఇక మొత్తంగా ఈ సినిమా నాలుగు కోట్ల వరకు బిజినెస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 4.5 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క.

దిల్ రాజు లవ్ టుడే
ఇక దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి తెలుగులో విడుదలవుతున్న తమిళ డబ్బింగ్ మూవీ లవ్ టుడే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ థియేటర్లలోనే విడుదలవుతోంది. ఈ సినిమా తమిళంలో పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది అని దిల్ రాజు 286కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

లవ్ టుడే టార్గెట్ ఎంతంటే..
లవ్ టుడే సినిమాకు తెలుగులో కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. తమిళంలో ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తప్పకుండా తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది అని దిల్ రాజు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.70 కోట్ల బిజినెస్ తో విడుదల కాంబోతోంది. అంటే 3 కోట్ల టార్గెట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇక లవ్ టుడే సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు కూడా మంచి గుర్తింపు అయితే లభించింది. మరి ఈ సినిమా మొత్తం ఎలాంటి లాభాలను అందుకుంటుందో చూడాలి.

అల్లు అరవింద్ తోడేలు
ఇక నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల కన్నడ డబ్బింగ్ మూవీ కాంతార సినిమాతో భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఆ సినిమాను మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేస్తే ఆ తర్వాత టాక్ ను బట్టి థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ భేడియా/తోడేలును కూడా అదే తరహాలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 260కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక టాక్ ను బట్టి ఆ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది.

తోడేలు టార్గెట్ ఎంతంటే..
వరుణ్ ధావన్ కృతి సనోన్ జంటగా నటించిన ఈ సినిమా హారర్ మిస్టరీ నేపథ్యంలో తెరపైకి రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ కు కూడా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక తెలుగులో ఈ సినిమాను తోడేలు టైటిల్ తో విడుదలవుతోంది. 2 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద 2.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. తప్పకుండా ఈ సినిమా కూడా అల్లు అరవింద్ కు మంచి లాభాలు అందించే అవకాశం అయితే ఉంది. కానీ టాక్ మొదటి రోజే బాగుండాలి. మరి ఈ సినిమాతో అల్లు అరవింద్ ఎలాంటి ప్రాఫిట్స్ అందుకుంటారో చూడాలి.