Dude Day 8 Collections: డ్యూడ్ వసూళ్లపై ఊహించని దెబ్బ.. ప్రదీప్ రంగనాథన్ మూవీకి 8వ రోజు ఎంతంటే?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై రవిశంకర్, నవీన్ యెర్నెనీ నిర్మించిన మూవీ డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించగా.. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. శరత్ కుమార్, హ్రిదు హరూన్, డ్రావిడ్ సెల్వమ్, సత్య, రోహిణి, ఐశ్వర్య శర్మలు కీలక పాత్రలు పోషించారు. నిఖిత్ బొమ్మి సినిమాటోగ్రఫి, భరత్ విక్రమన్ ఎడిటర్‌గా పనిచేశారు. సాయి అభయాంకర్ సంగీతం అందించారు. అక్టోబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరిన డ్యూడ్ చిత్రం.. తొలి వారం ఎన్ని కోట్లు రాబట్టింది? 8వ రోజు కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..
డ్యూడ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి డ్యూడ్ చిత్రానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్, టీజర్, ట్రైలర్లతో డ్యూడ్ మూవీకి మంచి బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రలో 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆంధ్రా, నైజాంలలో ప్రదీప్ రంగనాథన్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 11 కోట్ల రూపాయల షేర్... 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

డ్యూడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే... తమిళనాడులో 31 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 59 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ప్రదీప్ రంగనాథన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 60 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 120 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. డ్యూడ్ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా దాదాపు 550 స్క్రీన్‌లలో విడుదల చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
డ్యూడ్ ఏడు రోజుల కలెక్షన్స్
డ్యూడ్ చిత్రానికి తొలి రోజున ఇండియా వైడ్‌గా 9.75 కోట్ల రూపాయలు, రెండో రోజున 10.4 కోట్ల రూపాయలు, మూడో రోజున 10.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8.75 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 4 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో ఏడు రోజుల వరకు ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇండియాలో 56.5 కోట్ల రూపాయల నెట్.. 66.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
డ్యూడ్ ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాలో డ్యూడ్ ఎదురులేకుండా సాగుతోంది. ఇక్కడ ఇప్పటి వరకు 700K కలెక్షన్స్ (భారత కరెన్సీలో దాదాపు 6.14 కోట్ల రూపాయలు) రాబట్టి వన్ మిలియన్ మార్క్ వైపు పరుగులు తీస్తోంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్ తదితర దేశాలలో డ్యూడ్ మూవీకి 17 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఓవర్సీస్ నుంచి ప్రదీప్ రంగనాథన్ మూవీకి ఇప్పటి వరకు 23 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ప్రదీప్ రంగనాథన్ మూవీకి 7 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 89.5 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ చెప్పింది. అయితే డ్యూడ్ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ తెలిపిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే ... తొలి రోజున 3.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.9 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.6 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.8 కోట్ల రూపాయలు, ఐదో రోజున 1.15 కోట్ల రూపాయలు, ఆరో రోజున 65 లక్షల రూపాయలు, ఏడో రోజున 50 లక్షల రూపాయలు చొప్పున 12.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా డ్యూడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే... నైజాంలో 4.09 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 92 లక్షల రూపాయలు, ఆంధ్రాలో 3.39 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో డ్యూడ్ వసూళ్లు పరిశీలిస్తే... తమిళనాడులో 43.85 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలలో 14.25 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 5.02 కోట్ల రూపాయలు, కేరళ + రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.40 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 23 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.
డ్యూడ్ ఎనిమిదవ రోజు వసూళ్లు
దీపావళి సెలవులు ముగిసి వర్కింగ్ డేస్ మొదలైనప్పటి నుంచి ప్రదీప్ రంగనాథన్ మూవీకి బుకింగ్స్ పడిపోతూ వస్తున్నాయి. తమిళంలో బాగానే వర్కవుట్ అవుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పూర్తిగా చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. 8వ రోజు సాయంత్రం 5 గంటల వరకు తమిళంలో 18 శాతం, తెలుగులో 14 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో 8వ రోజు తమిళంలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, కేరళ+ కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











