ఒకటి హాలీవుడ్ వాయింపు...మరొకటి తమిళ తాలింపు

By Staff

Mrugam
ట్రేడ్ టాక్ : ప్రతీ శుక్రవారం సినిమాలు ఎన్నో ఆశలతో రిలీజ్ అవటం ...అవి భాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడం గత కొంతకాలంగా రొటీన్ గా జరుగుతున్న తెలుగు సినిమా వ్యవహారం. ఇక ఈ వారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి జె.డి హోమం అయితే మరొకటి తమిళ డబ్బింగ్ చిత్రం మృగం.

జె.డి చక్రవర్తి తెలుగులో మొదటసారి దర్శకత్వం చేస్తూ నటించిన హోమం చిత్రం ఎవరికీ నచ్చటంలేదని సమాచారం. అయితే టెక్నికల్ గా బాగానే తీసాడు అని పరిశ్రమలో పెరు తెచ్చిందీ చిత్రం. ఆస్కార్ విన్నింగ్ హాలివుడ్ సినిమా డిపార్టెడ్ ఫ్రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కథ,కథనంలో స్పష్టత లోపించింటం పెద్ద సమస్యగా మారి ప్రేక్షకులకు సహమ పరీక్ష పెడుతోంది. దొంగ-పోలీస్ ఆట తరహాలో ట్విస్ట్ లతో సాగే ఈ సినిమాలో పోలీసులు తమ మనిషిని మాఫియా లో పెడతారు. అలాగే మాఫియా వ్యక్తులు పోలీసుల్లో తమ మనిషిని పెట్టి మేటర్స్ లీక్ చేయ ప్రయత్నిస్తూంటారు. వీళ్ళిద్దరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళుండి ఎలా బయట పడకుండా తమ పనులను నెరవేర్చుకున్నారనేది స్టోరీలైను.

ఇక ఈ చిత్రంలో ఒరిజనల్ లో లేని కలిపిన తల్లి సెంటిమెంటు,లవ్ సీన్లు విడిగా కథలో కలవకుండా మిగిలిపోయాయి. ఇక జగపతిబాబు,మహేష్ ముంజ్రేకర్ లు మంచి నటన కనిపిచారు. పబ్లిసిటీ చేసినంతగా మమతా మోహనదాస్ సాంగ్ లో కిక్కు లేకపోవటం మరో మైనస్. కానీ సాక్షి శివానంద్ ఐటం సాంగ్ అదిరింది అంటున్నారు. ఇక డిపార్టెడ్ ...ఇంఫర్నెల్ ఎఫైర్స్ అనే కొరియా సినిమాకి రీమేక్ కావటం..దాన్ని జెరాక్స్ కాపీలా జెడీ ఫ్రీ మేక్ చేయటంతో అతని ప్రతిభను పెద్దగా లెక్కించటానికి అవకాశంలేదని విశ్లేషకుల వాదన . ఇక మృగం విషయానికి వస్తే పక్కా తమిళ వాసనలతో సహజత్వం పేరుతో జుగుప్సాకర సన్నివేశాలతో ఎయిడ్స్ అంశం చుట్టూ తిరిగే ప్రభోధాత్మక చిత్రం ఇది. ఎద్దు వీర్రాజు అనే మానవ మృగం కథ ఇది. అచ్చోసిన ఆంబోతులా తిరగే వీడి వృత్తి ఆవులపై ఆంబోతులను దాటించటం. కనిపించిన ప్రతీ ఆడదాన్ని వాయి వరసా లేకుండా అనుభవంచే అతను రాములమ్మని చూసి మనసు పారేసుకుంటాడు.

ఆమె అందరిలాంటి ఆడది కాదని అనుభవించటానికి పెళ్ళి తప్ప వేరే మార్గం లేదని పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత ఆమె ను అనుమానించటం ప్రారంభిస్తాడు. ఈ లోగా అతనికో వింత రోగం వస్తుంది. అక్కడి నుండి ఎలా మారడాన్నదే మిగతా కథ. చాలా భాగం శృంగారభరితంగా ఉండటం బి,సి సెంటర్లును ఆకట్టు కునే విషయమని డబ్బింగ్ చేసుంటారు కానీ ఆ టాకా కూడా వచ్చే వాతావరణం కనపడటం లేదు.

ఇక అంతకు ముందు వారం రిలీజైన చిత్రాలు... దాసరి అరుణ్ కుమార్ -స్నేహ జంటగా భరత్ పారేపల్లి దర్శకత్వంలో వచ్చిన ఆదివిష్ణు ఒకటి కాగా,మరొకటి రాజీవ్ కనకాల-సింధు తులాని నటించిన బ్లాక్ అండ్ వైట్ . అయితే ఈ రెండు చిత్రాల్లో ఆదివిష్ణు సినిమా పెద్ద సోది విష్ణులా ఉందని చిత్రం చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సీనియర్ దర్శకుడు డా .దాసరి నారాయణరావు అందించిన ఈ సినిమా కథే ఆదివిష్ణుని ముందుకు దూసుకు పోనివ్వకుండా ఆపుతోందనేది టాక్.

బ్లాక్ అండ్ వైట్ సినిమా దగ్గరకి వస్తే చిత్రీకరణ బాగున్నా రాజీవ్ కనకాల హీరో కావటం ఓపినింగ్స్ తేలేక దిగాలుపడింది. సింధు తులానీ ప్లస్ అయినా అది వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడటం లేదు.అలాగే గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలాదూర్ పూర్తి స్దాయి ప్లాఫ్ గా సెటిలైంది. సెల్యూట్ బి,సి సెంటర్లపై ఆశలు పెట్టుకుంది. నరేష్ సిద్దు ప్రమ్ శీకాకుళం పట్టించునే వారే కరువయ్యారు. దశావతారం,రెడీ స్టడీగా ఉంటే కథానాయకుడు చాలా చోట్ల తీసేసారు. ఇక ఈ వారం నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి భవిష్యత్ తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X