For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam Day 8 Collections: మళ్ళీ ఒక్కసారిగా పెరిగిన కలెక్షన్స్.. దుల్కర్ సల్మాన్ మొదటి బిగ్ హిట్!

    |

    ప్రేక్షకులు థియేటర్లోకి గతంలో మాదిరిగా రావడం లేదు అని కామెంట్స్ ఇటీవల కాలంలో చాలానే వచ్చాయి. అంతేకాకుండా భారీ సినిమాలకు మాత్రమే వస్తున్నారు అని లవ్ స్టోరీలు చిన్న సినిమాలకు ఆదరణ దక్కడం లేదు అనే వారు కూడా ఉన్నారు. అయితే ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా సీతారామం సినిమా సరైన సమాధానం ఇచ్చింది. కంటెంట్ కనెక్ట్ అయితే ఆడియన్స్ ఒక సినిమాను ఎన్నిసార్లు అయినా చూస్తారు అని సీతారామం సినిమా కలెక్షన్స్ తో రుజువయింది. ఇక 8వ రోజు ఊహించని విధంగా సినిమా కలెక్షన్స్ కొంత పెరిగాయి. మొత్తం ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఎంత లాభం వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..

    Recommended Video

    సీతా రాముల ప్రేమ కావ్యం, ఓ అద్భుతం *Reviews | Telugu FilmiBeat
    ఫ్లాప్స్ వచ్చినా.. మంచి బిజినెస్

    ఫ్లాప్స్ వచ్చినా.. మంచి బిజినెస్

    అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు, లై సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన విభిన్నమైన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం లో వచ్చిన చిత్రం సీతారామం. గత రెండు సినిమాలు కూడా ఈ దర్శకుడికి చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఈసారి సీతారామం సినిమాపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమాకు మంచి టాక్ అయితే ఏర్పడింది. ఇక ‘సీతా రామం' ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలుపుకుని మంచి బిజినెస్ అయితే చేసింది. ఈ మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

     8వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

    8వ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

    ‘సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 7వ రోజు కంటే 8వ రోజు అనూహ్యంగా కలెక్షన్లు కొంత పెరిగాయి. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ. 30 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 73 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

     8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    8 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్

    ‘సీతా రామం' సినిమాకు ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. టోటల్ ఏరియాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 4.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.28 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.81 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, గుంటూరులో రూ. 81 లక్షలు, కృష్ణాలో రూ. 95 లక్షలు, నెల్లూరులో రూ. 45 లక్షలతో కలిపి రూ. 11.66కోట్లు షేర్, రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

    వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 11.66 కోట్లు రాబట్టిన ‘సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.35 కోట్లు, మిగితా భాషల్లో రూ. 4.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 8 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 20.51 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 40.35 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

     లాభాల్లో కొనసాగుతున్న సీతారామం

    లాభాల్లో కొనసాగుతున్న సీతారామం

    దుల్కర్ సల్మాన్ కెరీర్ లో మొదటిసారి తెలుగులో ఒక బిగ్ సక్సెస్ అందుకున్నాడు. ‘సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. 8 రోజుల్లోనే దీనికి రూ. 20.51 కోట్లు వచ్చాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.51 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    English summary
    Dulquer Salmaan Sita Ramam 8 days worldwide Box Office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X