For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 10 Days Collections: సీతా రామంకు సండే లక్.. 10వ రోజు అన్ని కోట్లా.. లెక్కలు చూస్తే షాకే!

    |

    కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీలు అంతగా రావడం లేదు. దీంతో అలాంటి సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులంతా నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమ కావ్యమే 'సీతా రామం'. మలయాళంలో స్టార్‌గా వెలుగొందుతోన్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి.. అనుకున్నట్లుగానే మంచి స్పందన దక్కింది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఫలితంగా ఇది వారంలోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

    అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

    అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి రూపొందించిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చాడు.

    ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    ముందు నుంచే ఉన్న బజ్ వల్ల 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

    10వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    10వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    10వ రోజు 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి రూ. 1.13 కోట్లు షేర్, రూ. 1.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    10 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    'సీతా రామం'కు 10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.41 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.17 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.23 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 83 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 1.13 కోట్లు, నెల్లూరులో రూ. 55 లక్షలతో కలిపి రూ. 13.64 కోట్లు షేర్, రూ. 24.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 13.64 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.10 కోట్లు, మిగితా భాషల్లో రూ. 4.20 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 24.39 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 47.70 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లోనే దీనికి రూ. 24.39 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.39 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    పదో రోజే అన్ని కోట్లు మేర వసూళ్లు

    పదో రోజే అన్ని కోట్లు మేర వసూళ్లు

    దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే 10వ రోజైన ఆదివారం ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.29 కోట్లు షేర్ వసూలు అయింది. దీంతో రోజులు గడుస్తోన్నా ఈ రేంజ్ స్పందనతో విశ్లేషకులే అవాక్కవుతున్నారు.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 24.39 Cr in 10 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X