For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?

    |

    సీతారామం సినిమా అసలు ఈ టైం లో సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదట్లో చాలానే వచ్చాయి. ప్రస్తుతం భారీ సినిమాలను యాక్షన్ సినిమాలను మాత్రమే జనాలు చూస్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలా బలంగానే వినిపించాయి. కానీ ఆ కామెంట్స్ కు విభిన్నంగా సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పవర్ఫుల్ కలెక్షన్స్ తో అందరికి షాక్ ఇచ్చింది. కంటెంట్ కనెక్ట్ అయితే జనాలు ప్రేమ కథలను ఎక్కడికో తీసుకువెళ్తారు అని మరోసారి రుజువు చేశారు. ఇక ఈ సినిమా 11వ రోజు కలెక్షన్స్ అయితే దాదాపు మొదటి రోజు స్థాయిలోనే వచ్చాయి. మొత్తంగా 11 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ప్రాఫిట్ ఎంత వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    వైజయంతి మూవీస్ నుంచి వచ్చిన సీతారామంకు మంచి డిమాండ్ ఏర్పడింది. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ సినిమా మొత్తంగా రూ. 16.20 కోట్ల బిజినెస్ చేసింది.

    11వ రోజు కలెక్షన్లు

    11వ రోజు కలెక్షన్లు

    11వ రోజు 'సీతా రామం' సినిమాకు ఆంధ్ర, తెలంగాణలో దాదాపు మొదటి రోజు రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చాయి. ఇక నైజాంలో రూ. 65 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి రూ. 1.26 కోట్లు షేర్, రూ. 2.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    11 రోజుల టోటల్ కలెక్షన్స్

    11 రోజుల టోటల్ కలెక్షన్స్

    'సీతా రామం'కు 11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 6.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.47 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.04 లక్షలు, కృష్ణాలో రూ. 1.23 కోట్లు, నెల్లూరులో రూ. 60 లక్షలతో కలిపి రూ. 14.90 కోట్లు షేర్, రూ. 26.60 కోట్లు గ్రాస్ వసూలైంది.

     వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    వరల్డ్ వైడ్ కలెక్షన్లు

    11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 14.90 కోట్లు రాబట్టగా 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.40 కోట్లు, మిగితా భాషల్లో రూ. 4.65 కోట్లు వసూలు చేసింది. టోటల్ 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 26.60 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 52.30 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ప్రాఫిట్ ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ప్రాఫిట్ ఎంత?

    'సీతా రామం' మూవీకి అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ చేయగా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 26.60 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 9.60 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    English summary
    Dulquer Salmaan Sita Ramam Movie 11 Days Box Office Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X