twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 13 Days Collections: సీతా రామంకు తొలి షాక్.. కోటిన్నర వస్తే మరో ఘనత.. టోటల్ లాభమెంతంటే!

    |

    పేరుకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందని హీరోనే అయినా.. దక్షిణాది మొత్తంలో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను సంపాదించుకున్న స్టార్ దుల్కర్ సల్మాన్. మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ మధ్య వచ్చిన 'మహానటి' అనే చిత్రంతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పుడీ స్టార్ హీరో 'సీతా రామం' అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి అనుకున్నట్లుగానే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 13 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చేసిన సినిమా

    ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చేసిన సినిమా

    దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కలయికలో రూపొందిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

    ఫస్ట్ నైట్ గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ: ఏకంగా రెండు సార్లు అంటూ నోరు జారడంతో!ఫస్ట్ నైట్ గురించి పచ్చిగా మాట్లాడిన విష్ణుప్రియ: ఏకంగా రెండు సార్లు అంటూ నోరు జారడంతో!

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    భారీ అంచనాలతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

    13వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    13వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    13వ రోజు 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 42 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!కాజల్ అగర్వాల్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇలా!

    13 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    13 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    'సీతా రామం'కు 13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 6.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.49 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 94 లక్షలు, గుంటూరులో రూ. 1.10 కోట్లు, కృష్ణాలో రూ. 1.29 కోట్లు, నెల్లూరులో రూ. 63 లక్షలతో కలిపి రూ. 15.94 కోట్లు షేర్, రూ. 28.20 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    13 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 15.94 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.65 కోట్లు, మిగితా భాషల్లో రూ. 5.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 13 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 28.54 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 56.35 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!హాట్ షోతో షాకిచ్చిన కీర్తి సురేష్: ఆమెనిలా ఎప్పుడూ చూసుండరు!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లోనే దీనికి రూ. 28.54 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 11.54 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు

    తొలిసారి ఇంత తక్కువ వసూళ్లు

    హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో 13వ రోజు దీనికి తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా కోటి కంటే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి మరో రూ. 1.50 కోట్లు వసూలు అయితే.. ఇది 30 కోట్ల మార్కును చేరుకుంటుంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 28.54 Cr in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X