For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 16 Days Collections: మళ్లీ వసూళ్లు డౌన్.. అయినా అన్ని కోట్ల లాభం.. ఇంకో 2 కోట్లు వస్తే!

    |

    మారిన పరిస్థితుల వల్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలా వచ్చిన చిత్రాలకు కూడా ప్రేక్షకులు పెద్దగా ప్రాధాన్యాన్ని కూడా ఇవ్వడం లేదు. దీంతో దర్శక నిర్మాతలు అలాంటి సినిమాలు చేయాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రేమ కథా దృశ్య కావ్యమే 'సీతా రామం'.

    మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

    ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం

    ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం


    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

    బిగ్ బాస్ దివి అరాచకం: అసలైన అందాలను చూపిస్తూ హాట్ షో

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్


    ఎన్నో అంచనాలతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

    16వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    16వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు


    16వ రోజు 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 20 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి రూ. 45 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    ఈషా రెబ్బ పరువాల జాతర: అబ్బా.. ఆమెనిలా చూస్తే మెంటలే

    16 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    16 రోజులకు కలిపి ఎంత వచ్చింది


    'సీతా రామం'కు 16 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.60 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.52 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.01 కోట్లు, గుంటూరులో రూ. 1.18 కోట్లు, కృష్ణాలో రూ. 1.39 కోట్లు, నెల్లూరులో రూ. 68 లక్షలతో కలిపి రూ. 17.25 కోట్లు షేర్, రూ. 30.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?


    16 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 17.25 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లు, మిగితా భాషల్లో రూ. 5.80 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 16 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 31.05 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 61.65 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


    అందమైన దృశ్య కావ్యంగా వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లోనే దీనికి రూ. 31.05 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 14.05 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    మరో రెండు కోట్లు వసూలు అయితే

    మరో రెండు కోట్లు వసూలు అయితే


    హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా ఏకంగా లాభాలనే రూ. 14.05 కోట్లు అందుకుంది. ఇక, మరో రెండు కోట్ల రూపాయలను వసూలు చేస్తే.. ఇది డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 31.05 Cr in 16 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X