Sita Ramam 17 Days Collections: సండే షాకింగ్ వసూళ్లు.. ఒక్కసారిగా డబుల్.. లాభమెంతో తెలిస్తే!

ఎప్పటి నుంచో తెలుగు సినీ పరిశ్రమలో వేరే భాషలకు చెందిన హీరోలు కూడా స్ట్రయిట్ మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది స్టార్లు మన దగ్గర కూడా హవాను చూపించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన దుల్కర్ సల్మాన్ కూడా టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం అతడు 'మహానటి' చిత్రంతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ఇక, ఇప్పుడీ స్టార్ హీరో 'సీతా రామం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు ఇక్కడి ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 17 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

అందమైన ప్రేమ కావ్యంగా వచ్చింది

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

భారీ అంచనాలతో విడుదలైన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

17వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

17వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

'సీతా రామం' మూవీకి 17వ రోజు ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 82 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వచ్చింది.

17 రోజులకు కలిపి ఎంత వచ్చింది

17 రోజులకు కలిపి ఎంత వచ్చింది

17 రోజుల్లో 'సీతా రామం'కు ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.80 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.58 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.46 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి రూ. 18.07 కోట్లు షేర్, రూ. 32.10 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ఏపీ, తెలంగాణలో 17 రోజుల్లో రూ. 18.07 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.15 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.40 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 17 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 32.77 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 65.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

స్వచ్చమైన ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 17 రోజుల్లోనే దీనికి రూ. 32.77 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 15.77 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

ఆదివారం సీతా రామంకు డబుల్

ఆదివారం సీతా రామంకు డబుల్

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇది శనివారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 70 లక్షలు వసూలు చేయగా.. ఆదివారం మాత్రం ఏకంగా రూ. 1.72 కోట్లు షేర్‌ను రాబట్టి సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X