twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 18 Days Collections: కలెక్షన్స్ తగ్గినా నో ప్రాబ్లమ్.. ఈ రేంజ్ ప్రాఫిట్స్ ఊహించి ఉండరు!

    |

    మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ అందించే దిశగా కొనసాగుతోంది. ఈ సినిమా మొదట ఈ స్థాయిలో సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక సోమవారం రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినప్పటికీ కూడా నిర్మాతలకు మంచి ప్రాఫిట్ అయితే దక్కింది. ఇక మొత్తంగా 18 రోజుల్లో సీతారామం సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది? అలాగే పెట్టిన పెట్టుబడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే..

    సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్

    సీతారామం ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మించిన సీతారామం సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇంతకుముందు దర్శకుడు పడి పడి లేచే మనసు, లై సినిమాలతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా సినిమా బిజినెస్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇంకా మొత్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

     18వ రోజు ఆంధ్ర తెలంగాణ వసూళ్లు

    18వ రోజు ఆంధ్ర తెలంగాణ వసూళ్లు

    'సీతా రామం' మూవీకి 18వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు కొంత తగ్గాయి. నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 33 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వచ్చింది.

    18 రోజుల్లో టోటల్ కలెక్షన్స్

    18 రోజుల్లో టోటల్ కలెక్షన్స్

    18 రోజుల్లో 'సీతా రామం'కు ఏపీ, తెలంగాణలో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 7.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.29 కోట్లు, కృష్ణాలో రూ. 1.48 కోట్లు, నెల్లూరులో రూ. 72 లక్షలతో కలిపి రూ. 18.40 కోట్లు షేర్, రూ. 32.65 కోట్లు గ్రాస్ వసూలైంది.

    వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

    ఏపీ, తెలంగాణలో 18 రోజుల్లో రూ. 18.40 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 18 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 33.28 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 66.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    డబుల్ ప్రాఫిట్స్

    డబుల్ ప్రాఫిట్స్

    ఒక అందమైన ప్రేమకథగా 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లోనే రూ. 32.77 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.28 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 32.77 Cr in 18 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X