Sita Ramam 19 Days Collections: మరోసారి పెరిగిన వసూళ్లు.. 19 రోజుల్లో కోట్ల వర్షం.. లాభం ఎంతంటే!

చాలా కాలం వరకూ తెలుగులో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీలకు భారీ రెస్పాన్స్ వస్తూ ఉండేది. అయితే, ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు అలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన ప్రేమకథా దృశ్య కావ్యమే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ భారీ రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. మధ్యలో కాస్తంత తగ్గినా మళ్లీ పెరుగుతూ వచ్చాయి. ఇలా ఇప్పటికే కొన్ని కోట్ల లాభాలను కూడా అందుకుందీ చిత్రం. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 19 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చేసింది

స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చేసింది

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబోలో వచ్చిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

విడుదలకు ముందే బజ్ ఉన్న 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

19వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

19వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

19వ రోజు 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు మళ్లీ పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 38 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ వచ్చింది.

19 రోజులకు కలిపి ఎంత వచ్చింది

19 రోజులకు కలిపి ఎంత వచ్చింది


'సీతా రామం'కు 19 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.86 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.93 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.65 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, గుంటూరులో రూ. 1.32 కోట్లు, కృష్ణాలో రూ. 1.51 కోట్లు, నెల్లూరులో రూ. 73 లక్షలతో కలిపి రూ. 18.78 కోట్లు షేర్, రూ. 33.30 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?


19 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 18.78 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.25 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 33.88 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 67.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 19 రోజుల్లోనే దీనికి రూ. 33.88 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 16.88 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది

డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి రూపొందించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ రూ. 16.20 కోట్లు జరగ్గా.. ఆ మొత్తాన్ని రాబట్టడంతో పాటు మరో రూ. 16.88 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X