Sita Ramam 2 Days Collections: రెండో రోజు అరాచకం.. ఈ మధ్య కాలంలో ఇలా జరగలేదు.. టోటల్ ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో మూవీలు పెద్దగా రావడం లేదు. దీంతో సినీ లవర్స్ ఆ తరహా చిత్రాల కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'సీతా రామం'. మలయాళంలో స్టార్‌గా వెలుగొందుతోన్న దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని శుక్రవారమే విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం పదండి!

 ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం

ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఇది మూడు భాషల్లో రిలీజైంది.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్


అంచనాలకు అనుగుణంగానే 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ జరిగింది.

 రెండో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

రెండో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

ఆంధ్ర, తెలంగాణలో 'సీతా రామం' మూవీకి 2వ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 82 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి రూ. 2.08 కోట్లు షేర్, రూ. 3.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకు కలిపి ఎంతొచ్చింది

రెండు రోజులకు కలిపి ఎంతొచ్చింది


'సీతా రామం' మూవీకి 2 రోజుల్లో ఏపీ, టీఎస్‌లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 3.58 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?


ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 3.58 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 35 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.85 కోట్లు, మిగితా భాషల్లో రూ. 90 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 6.68 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 13.30 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లోనే దీనికి రూ. 6.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.32 కోట్లు రాబడితే ఇది క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఈ మధ్య కాలంలో ఇలా జరగలేదు

ఈ మధ్య కాలంలో ఇలా జరగలేదు


'సీతా రామం' మూవీకి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.50 కోట్లు వసూలు అయ్యాయి. ఇక, రెండో రోజు దీనికి రూ. 2.08 కోట్లు వచ్చాయి. అంటే మొదటి రోజు కంటే రెండో రోజు దీనికి రూ. 50 లక్షలు పైగా వసూళ్లు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా సెకెండ్ డే వసూళ్లు ఎక్కువగా రాలేదు. ఇక, ఈ చిత్రానికి మూడో రోజు మరింత ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X