Sita Ramam 20 Days Collections: భారీగా తగ్గిన వసూళ్లు.. అయినా అన్ని కోట్ల లాభాలతో రికార్డు
కొంత కాలంగా దక్షిణాదికి చెందిన హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుస సినిమాలు చేసి మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోలు మన ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఈ క్రమంలోనే మలయాళ పరిశ్రమకు చెందిన దుల్కర్ సల్మాన్ కూడా ఇప్పటికే 'మహానటి' చిత్రంతో తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. ఇక, ఇప్పుడు ఈ హీరో 'సీతా రామం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 20 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దామా!

సీతా రామం సినిమాలో ఎవరెవరు?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్
భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

20వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు
'సీతా రామం' మూవీకి 20వ రోజు ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు మళ్లీ తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

20 రోజులకు కలిపి ఎంత వచ్చింది
'సీతా రామం'కు ఏపీ, తెలంగాణలో 20 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.97 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.68 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.34 కోట్లు, కృష్ణాలో రూ. 1.53 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో కలిపి రూ. 19.03 కోట్లు షేర్, రూ. 33.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?
20 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 19.03 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.30 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.90 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 20 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 34.53 కోట్లు షేర్‌తో పాటు రూ. 69.80 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 20 రోజుల్లోనే దీనికి రూ. 34.53 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.53 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

లాభాలతో రికార్డు క్రియేట్ చేసింది
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. దీంతో ఈ సినిమా బిజినెస్ రూ. 16.20 కోట్లు జరగ్గా.. టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 17.53 కోట్ల లాభాలను అందుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











