Sita Ramam 23 Days Collections: కలిసొచ్చిన వీకెండ్.. భారీ వసూళ్లతో రికార్డు.. ఇంకో 50 లక్షలు వస్తే!

మలయాళంలో తనదైన చిత్రాలతో సత్తా చాటుతూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు మెగాస్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిపోయాడు. దీంతో ఇక్కడ కూడా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు.

ఈ ఉత్సాహంతోనే ఇటీవలే దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' అనే సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు విశేషమైన స్పందన దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 23 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

స్వచ్చమైన ప్రేమ కథతో వచ్చింది

స్వచ్చమైన ప్రేమ కథతో వచ్చింది

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.23 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

23వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

23వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

23వ రోజు ఆంధ్ర, తెలంగాణలో 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 48 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షతో కలిపి ఈ మూవీ రూ. 88 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

23 రోజులకు కలిపి ఎంత వచ్చింది

23 రోజులకు కలిపి ఎంత వచ్చింది

ఏపీ, తెలంగాణలో 'సీతా రామం'కు 23 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.77 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.14 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.78 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.15 కోట్లు, గుంటూరులో రూ. 1.42 కోట్లు, కృష్ణాలో రూ. 1.60 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలతో కలిపి రూ. 20.23 కోట్లు షేర్, రూ. 35.85 కోట్లు గ్రాస్ వసూలైంది.

 ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

23 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 20.23 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.48 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.70 కోట్లు, మిగితా భాషల్లో రూ. 7.15 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 23 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 36.56 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 73.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 23 రోజుల్లోనే దీనికి రూ. 36.56 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 19.56 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

రికార్డు వసూళ్లు.. 50 లక్షలు వస్తే

రికార్డు వసూళ్లు.. 50 లక్షలు వస్తే

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. మరీ ముఖ్యంగా 23వ రోజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 20 కోట్ల షేర్ మార్కును దాటేసింది. అంతేకాదు, మరో యాభై లక్షల రూపాయలు వసూలు చేస్తే.. ఇది రూ. 20 కోట్ల లాభాల మార్కును కూడా చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X