Sita Ramam 24 Days Collections: సండే సంచలన వసూళ్లు.. బింబిసార రికార్డు బ్రేక్.. సినీ పెద్దలే షాక్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో ఎన్నో రకాల సినిమాలు వచ్చేవి. అయితే, ఇప్పుడు వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోతూనే ఉంది. దీంతో ఆ జోనర్‌ను ఇష్టపడే సినీ ప్రియులు అలాంటి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందమైన ప్రేమకావ్యమే 'సీతా రామం'. స్వచ్చమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. దీంతో ఆరంభంలోనే అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తున్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 24 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

అందమైన దృశ్యకావ్యంగా వచ్చింది
హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్
ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ అయింది.

24వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు
ఆంధ్ర, తెలంగాణలో 24వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 44 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 18 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షతో కలిపి ఈ మూవీ రూ. 93 లక్షలు షేర్, రూ. 1.55 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

24 రోజులకు కలిపి ఎంత వచ్చింది
24 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.83 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.32 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.84 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.19 కోట్లు, గుంటూరులో రూ. 1.48 కోట్లు, కృష్ణాలో రూ. 1.65 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో కలిపి రూ. 21.16 కోట్లు షేర్, రూ. 37.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?
ఆంధ్రా, తెలంగాణలో 24 రోజుల్లో రూ. 21.16 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.85 కోట్లు, మిగితా భాషల్లో రూ. 7.60 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 24 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 38.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 77.00 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
స్వచ్చమైన ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 24 రోజుల్లోనే దీనికి రూ. 38.21 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.21 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

భారీగా పెరిగాయి.. బింబిసార బ్రేక్
దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. నాలుగో వారంలోనూ ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. దీంతో 'బింబిసార' టోటల్ కలెక్షన్లు (37.25 కోట్లు) ఇది దాటేసింది. అంతేకాదు, కల్యాణ్ రామ్ మూవీకి 24 రోజుల్లో రూ. 21.05 కోట్ల లాభాలు వస్తే.. సీతా రామంకు రూ. 21.21 కోట్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications











