For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 27 Days Collections: పండుగ రోజు వసూళ్లు డబుల్.. ఇంకో 27 లక్షలు వస్తే సంచలన రికార్డు

    |

    తెలుగు సినిమా స్థాయి క్రమంగా పెరుగుతూనే ఉంది. మన దగ్గర వచ్చే చిత్రాలకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన దక్కుతోంది. దీంతో మన హీరోలు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. అదే సమయంలో మిగతా ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. అతడు నటించిన చిత్రమే 'సీతా రామం'. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల భారీ స్పందనను అందించారు. ఫలితంగా ఇది కలెక్షన్లను సైతం భారీ స్థాయిలో రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    అద్భుతమైన ప్రేమకథతో వచ్చింది

    అద్భుతమైన ప్రేమకథతో వచ్చింది

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

    శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    స్వచ్ఛమైన ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్లు బిజినెస్ జరిగింది.

    27వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    27వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    27వ రోజు ఆంధ్ర, తెలంగాణలో 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి ఈ మూవీ రూ. 52 లక్షలు షేర్, రూ. 1.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

    అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

    27 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    27 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 27 రోజుల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.88 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.45 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.24 కోట్లు, గుంటూరులో రూ. 1.56 కోట్లు, కృష్ణాలో రూ. 1.71 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో కలిపి రూ. 22.13 కోట్లు షేర్, రూ. 39.25 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    27 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 22.13 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.95 కోట్లు, మిగితా భాషల్లో రూ. 7.90 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 27 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 39.73 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 80.10 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 27 రోజుల్లోనే దీనికి రూ. 39.73 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 22.73 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    మరో 27 లక్షలు వస్తే సరికొత్ రికార్డ్

    మరో 27 లక్షలు వస్తే సరికొత్ రికార్డ్


    దుల్కర్ సల్మాన్ - మృణాల్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. నాలుగో వారంలోనూ ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మరో రూ. 27 లక్షలు షేర్ వసూలు అయితే.. ఇది రూ. 40 కోట్ల మార్కును చేరుతుంది. ఇదే జరిగితే దుల్కర్‌ రికార్డును క్రియేట్ చేస్తాడు.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 39.73 Cr in 27 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X