twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 29 Days Collections: మళ్లీ వసూళ్లు డౌన్.. అయినా అన్ని కోట్లు.. 25 లక్షలు వస్తే రికార్డు

    |

    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీ స్థాయి భారీగా పెరుగతూ వస్తోంది. దీంతో అన్ని ఇండస్ట్రీలకు చెందిన వాళ్లు మన చిత్రాలపై ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో వేరే భాషల్లోని స్టార్ హీరోలు మన దగ్గర మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు హీరోలు కూడా నేరుగా టాలీవుడ్‌లో సినిమాలు చేశారు.

    అలా ఇటీవలే మలయాళ బడా హీరో దుల్కర్ సల్మాన్ 'సీతా రామం' అనే తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూర్తి స్థాయి ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ విశేషమైన స్పందన దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. అయితే, 29వ రోజు కాస్త తగ్గాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ‘సీతా రామం'

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ‘సీతా రామం'

    దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కలయికలో వచ్చిన ఫీల్ గుడ్ మూవీనే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

    ప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షోప్రియాంక చోప్రా ఎద అందాల ఆరబోత: బటన్స్ విప్పేసి మరీ హాట్ షో

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    అందమైన ప్రేమకథా కావ్యంగా వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి దీనికి రూ. 16.20 కోట్లు బిజినెస్ జరిగింది.

    29వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    29వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    ఆంధ్ర, తెలంగాణలో 29వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, గుంటూరులో రూ. 20 వేలు, కృష్ణాలో రూ. 20 వేలు, నెల్లూరులో రూ. 80 వేలతో కలిపి రూ. 10 లక్షలు షేర్, రూ. 18 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

    బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!బట్టలు లేకుండా చరణ్ హీరోయిన్: ఆ పార్టును మాత్రమే చూపిస్తూ దారుణంగా!

    29 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    29 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 29 రోజుల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.48 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.94 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.57 కోట్లు, కృష్ణాలో రూ. 1.73 కోట్లు, నెల్లూరులో రూ. 88 లక్షలతో కలిపి రూ. 22.40 కోట్లు షేర్, రూ. 39.75 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    29 రోజుల్లో తెలుగులో రూ. 22.40 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.30 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.00 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 30 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 29 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.53 కోట్లు షేర్‌, రూ. 80.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 29 రోజుల్లోనే దీనికి రూ. 40.53 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.53 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    హిందీలో రిలీజ్.. రెస్పాన్స్ భారీగా

    హిందీలో రిలీజ్.. రెస్పాన్స్ భారీగా

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతా రామం' మూవీ దక్షిణాది భాషల్లోనే విడుదలైంది. ఇక, తాజాగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం హిందీలోనూ రిలీజ్ అయింది. అక్కడ దీనికి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో మొదటి రోజే ఈ సినిమా రూ. 50 లక్షలు నెట్, రూ. 30 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. దీంతో ఈ చిత్రానికి అక్కడ రెస్పాన్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 40.53 Cr in 29 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X