twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 3 Weeks Collections: 17 కోట్ల టార్గెట్.. 3 వారాల్లోనే అన్ని కోట్లు.. ఊహించని లాభాలు

    |

    చాలా కాలంగా తెలుగులో ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీలు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఆ తరహా సినిమాల కోసం మన ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే విడుదలైన అందమైన ప్రేమకథా దృశ్య కావ్యమే 'సీతా రామం'. మలయాళంలో స్టార్‌గా సత్తా చాటుతోన్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా దీనికి కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. దీంతో లాభాలు కూడా కోట్లలో సొంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 3 వారాల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సీతా రామం

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సీతా రామం

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు.

    Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    క్రేజీ బజ్‌తో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.21 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

    21వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    21వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    21వ రోజు 'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో కలెక్షన్లు పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 8 వేలు, నెల్లూరులో రూ. 20 వేలతో కలిపి రూ. 12 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

    దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

    3 వారాలకు కలిపి ఎంత వచ్చింది

    3 వారాలకు కలిపి ఎంత వచ్చింది


    'సీతా రామం'కు ఏపీ, తెలంగాణలో 3 వారాల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.99 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.69 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.35 కోట్లు, కృష్ణాలో రూ. 1.54 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో కలిపి రూ. 19.15 కోట్లు షేర్, రూ. 34.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    3 వారాల్లో ఏపీ, తెలంగాణలో రూ. 19.15 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.33 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.32 కోట్లు, మిగితా భాషల్లో రూ. 6.96 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 21 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 34.76 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 70.25 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    అందమైన ప్రేమ కావ్యంగా వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 3 వారాల్లోనే దీనికి రూ. 34.76 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 17.76 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    ఫుల్ రన్‌లో చాలా తక్కువ వసూళ్లు

    ఫుల్ రన్‌లో చాలా తక్కువ వసూళ్లు


    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి రూపొందించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, దీనికి 21వ రోజు మాత్రం ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 12 లక్షలు, ప్రపంచ వ్యాప్తంగా రూ. 23 లక్షలు వసూలు చేసింది. ఫుల్ రన్‌లో ఇంత తక్కువ కలెక్షన్లు ఎప్పుడూ రాలేదు.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 34.76 Cr in 3 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X