twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 30 Days Collections: హిందీలో సీతా రామం మాస్.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. ఇక్కడ మాత్రం!

    |

    తెలుగులో గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో స్వచ్చమైన ప్రేమకథలతో సినిమాలు పెద్దగా రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాలను ఇష్టపడే సినీ ప్రియులు నిరాశగా ఉన్నారు. మధ్యలో ప్యూర్ లవ్ స్టోరీతో కొన్ని మూవీలు వచ్చినా.. అవి ప్రేక్షకులను అంతగా అలరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే విడుదలైన చిత్రం 'సీతా రామం'.

    మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి స్పందన భారీగా దక్కింది. దీంతో కలెక్షన్లు ఇప్పటికీ పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' టోటల్ కలెక్షన్లను చూద్దాం పదండి!

    క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన సీతా రామం

    క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన సీతా రామం

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి తీసిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.

    JGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయంJGM: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు మరో షాక్.. జనగణమనపై పూరీ జగన్నాథ్ సంచలన నిర్ణయం

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి దీనికి టోటల్‌గా రూ. 16.20 కోట్లు బిజినెస్ అయింది.

    30వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    30వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    ఆంధ్ర, తెలంగాణలో 30వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 80 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 వేలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి రూ. 14 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

    వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!వేణు మాధవ్ మరణంపై పెదవి విప్పిన కొడుకులు: ఆయనకు గర్ల్‌ఫ్రెండ్ ఎక్కువ.. అదే ప్రాణం తీసిందంటూ!

    30 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    30 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 30 రోజుల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.72 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.91 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.95 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.58 కోట్లు, కృష్ణాలో రూ. 1.74 కోట్లు, నెల్లూరులో రూ. 89 లక్షలతో కలిపి రూ. 22.54 కోట్లు షేర్, రూ. 40.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    30 రోజుల్లో తెలుగులో రూ. 22.54 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.82 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.07 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.05 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 70 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 30 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.18 కోట్లు షేర్‌, రూ. 83.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

    యాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షోయాంకర్ రష్మీ అందాల ఆరబోత: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఊహించని హాట్ షో

     బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    స్వచ్చమైన ప్రేమకావ్యంగా వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 30 రోజుల్లోనే దీనికి రూ. 41.18 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.18 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    హిందీలో భారీగా వసూళ్లు రాబట్టింది

    హిందీలో భారీగా వసూళ్లు రాబట్టింది

    దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'సీతా రామం' మూవీ దక్షిణాది భాషల్లోనే విడుదలైంది. ఇక, తాజాగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం హిందీలోనూ రిలీజ్ అయింది. అక్కడ దీనికి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 1.50 కోట్లు నెట్, రూ. 70 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. ఈరోజుతో కోటి మార్కును దాటే అవకాశం ఉంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 41.18 Cr in 30 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X