twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 31 Days Collections: కలిసొచ్చిన హిందీ రిలీజ్.. అక్కడ రికార్డు.. 10 లక్షలు వస్తే సంచలనం

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు వస్తుంటాయి. అయితే, అందులో అన్ని చిత్రాలూ ప్రేక్షకుల మనసు దోచుకోవడం లేదు. అందులోనూ ఈ ఏడాదిలో పెద్దగా టాలీవుడ్‌కు విజయాలు కూడా దక్కడం లేదు. మరీ ముఖ్యంగా జూన్, జూలైలో ఎన్నో ఫ్లాపులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రమే 'సీతా రామం'.

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. దీంతో ఆరంభంలోనే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే దీనికి భారీ స్థాయిలో వసూళ్లు కూడా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 'సీతా రామం' మూవీ 31 రోజుల్లో ఎంత వసూలు చేసిందన్న దానిపై పూర్తి వివరాలు మీ అందరి కోసం!

    స్వచ్చమైన ప్రేమకథతో సీతా రామం

    స్వచ్చమైన ప్రేమకథతో సీతా రామం

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కలయికలో వచ్చిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు.

    హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోతహాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి టోటల్‌గా రూ. 16.20 కోట్లు బిజినెస్ జరిగింది.

    31వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    31వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    31వ రోజు ఆంధ్ర, తెలంగాణలో 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి రూ. 20 లక్షలు షేర్, రూ. 35 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

    సరయు రాయ్ ఎద అందాల జాతర: చీర కొంగును పక్కకు జరిపి మరీ!సరయు రాయ్ ఎద అందాల జాతర: చీర కొంగును పక్కకు జరిపి మరీ!

     31 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    31 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 'సీతా రామం'కు 31 రోజుల్లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.81 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.96 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, గుంటూరులో రూ. 1.60 కోట్లు, కృష్ణాలో రూ. 1.76 కోట్లు, నెల్లూరులో రూ. 90 లక్షలతో కలిపి రూ. 22.74 కోట్లు షేర్, రూ. 40.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    31 రోజుల్లో తెలుగులో రూ. 22.74 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.84 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.12 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.10 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 31 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 41.90 కోట్లు షేర్‌, రూ. 85.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    అద్భుతమైన కథతో రూపొందిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 31 రోజుల్లోనే దీనికి రూ. 41.90 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 24.90 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    కోటి దాటింది.. పది లక్షలు వస్తే

    కోటి దాటింది.. పది లక్షలు వస్తే

    దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీ దక్షిణాది భాషల్లోనే విడుదలైంది. ఇక, తాజాగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం హిందీలోనూ రిలీజ్ అయింది. అక్కడ దీనికి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 1.10 షేర్‌ను వసూలు చేసింది. ఇక, ఈ చిత్రానికి మరో రూ. 10 లక్షలు షేర్ వస్తే.. రూ. 25 కోట్ల లాభాలు వస్తాయి.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 41.90 Cr in 31 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X