For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 32 Days Collections: సీతా రామం సంచలన రికార్డు.. 32వ రోజు మాత్రం షాకింగ్‌గా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల చిత్రాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను చేరుకుంటాయి. తద్వారా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వరదను సృష్టిస్తుంటాయి. అలా కొద్ది రోజుల క్రితం వచ్చిన చిత్రమే 'సీతా రామం'. పూర్తి స్థాయిలో ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. దీనికితోడు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు.

    అనుకున్నట్లుగానే అన్ని చోట్లా ఈ మూవీకి భారీ స్పందన దక్కింది. ఫలితంగా నెల రోజులు దాటినా కలెక్షన్లను భారీగానే రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 32 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ‘సీతా రామం'

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ‘సీతా రామం'

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన తెలుగు చిత్రమే 'సీతా రామం'. హను రాఘవపూడి తీసిన ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు.

    హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి టోటల్‌గా రూ. 16.20 కోట్లు బిజినెస్ అయింది.

    32వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    32వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    ఆంధ్ర, తెలంగాణలో 32వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ.1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షతో కలిపి రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

    Manchu Manoj రెండో పెళ్లి.. కాబోయే శ్రీమతితో పూజలు.. ఎవరీ మౌనికారెడ్డి?

     32 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    32 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    32 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.97 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 1.61 కోట్లు, కృష్ణాలో రూ. 1.77 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి రూ. 22.86 కోట్లు షేర్, రూ. 40.55 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    తెలుగులో 32 రోజుల్లో రూ. 22.86 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.20 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.13 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 32 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.34 కోట్లు షేర్‌, రూ. 86.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    దుల్కర్ - హను కాంబినేషన్‌లో వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 32 రోజుల్లోనే దీనికి రూ. 42.34 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 25.34 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    32వ రోజు షాకింగ్.. సంచలన రికార్డ్

    32వ రోజు షాకింగ్.. సంచలన రికార్డ్

    దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కింది. అయితే, 32వ రోజు మాత్రం దీనికి టోటల్‌గా రూ. 44 లక్షలే వచ్చాయి. అందులో రూ. 20 లక్షలు హిందీలోనే సాధించింది. ఇక, ఈ సినిమా తాజాగా రూ. 25 కోట్ల లాభాల మార్కును దాటేసింది. తద్వారా సీతా రామం సంచలన రికార్డు అందుకుంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 42.34 Cr in 32 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X