twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 33 Days Collections: హిందీలో బిగ్ షాక్.. తెలుగులోనూ డౌన్.. కానీ లాభం మాత్రం కోట్లలో!

    |

    ఇండియా మొత్తంలోనే ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. దీంతో మన భాషలో వచ్చే చిత్రాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా మార్కెట్‌ను పెంచుకునేందుకు వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్లు టాలీవుడ్‌లో నేరుగా సినిమాలు చేస్తున్నారు.

    అలా ఇటీవలే మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా 'సీతా రామం' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి అన్ని ఏరియాల్లో భారీ స్పందన వచ్చింది. ఇక, హిందీలోనూ దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 33 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

    స్వచ్చమైన ప్రేమకథతో సీతా రామం

    స్వచ్చమైన ప్రేమకథతో సీతా రామం

    దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తెలుగు చిత్రమే 'సీతా రామం'. హను రాఘవపూడి తీసిన ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ ప్రొడ్యూస్ చేశారు.

    ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!ఏమీ లేకుండా పాయల్ సెల్ఫీ వీడియో: అన్ని యాంగిల్స్ నుంచి చూపిస్తూ!

     సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    స్వచ్చమైన ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి టోటల్‌గా రూ. 16.20 కోట్లు బిజినెస్ జరిగింది.

    33వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    33వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సీతా రామం' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో ఇది నెల రోజులుగా హవాను చూపిస్తోంది. అయితే, 33వ రోజైన మంగళవారం మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్లు పడిపోయాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు షేర్, రూ. 15 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

    ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్: ప్రైవేటు పార్టులను చూపిస్తూ దారుణంగా!

    33 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    33 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 33 రోజుల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.97 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.27 కోట్లు, గుంటూరులో రూ. 1.62 కోట్లు, కృష్ణాలో రూ. 1.78 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో కలిపి రూ. 22.94 కోట్లు షేర్, రూ. 40.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    33 రోజుల్లో తెలుగులో రూ. 22.94 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.86 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.22 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.15 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 33 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 42.62 కోట్లు షేర్‌, రూ. 87.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోతహాట్ షోలో హద్దు దాటిన జబర్ధస్త్ రీతూ చౌదరి: తొలిసారి బికినీలో అందాల ఆరబోత

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    దుల్కర్ నటించిన పాన్ ఇండియన్ సినిమా 'సీతా రామం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 33 రోజుల్లోనే దీనికి రూ. 42.62 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 25.62 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    హిందీలో అన్ని లక్షలు మాత్రమే

    హిందీలో అన్ని లక్షలు మాత్రమే

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా హిందీలో విడుదలైన తర్వాత ఇది మంచి వసూళ్లను రాబడుతూ వస్తోంది. అయితే, మంగళవారం మాత్రం అక్కడ దీనికి కేవలం రూ. 15 లక్షలే వచ్చాయి. అలాగే, ఓవరాల్‌గా రూ. 28 లక్షలనే ఈ సినిమా వసూలు చేసింది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 42.62 Cr in 33 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X