twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 4 Weeks Collections: సీతా రామం సంచలన రికార్డు.. 17 కోట్లకు అమ్మితే అన్ని కోట్ల వసూళ్లా!

    |

    తెలుగులో చాలా కాలం పాటు లవ్ స్టోరీలతోనే సినిమాలు వచ్చాయి. అయితే, ఇప్పుడా ట్రెండ్ మారిపోవడంతో దర్శక నిర్మాతలు, హీరోలు సరికొత్త ప్రయోగాలు చేస్తూ అలాంటి వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఫలితంగా సినీ ప్రియులు ప్రేమకథా చిత్రాల కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీనే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

    అందుకు అనుగుణంగానే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో అసలు నాలుగు వారాల్లో 'సీతా రామం' ఎంత వసూలు చేసింది? ఎంత లాభాన్ని అందుకుంది? అనేవి చూద్దాం పదండి!

    అందమైన ప్రేమకావ్యంగా వచ్చింది

    అందమైన ప్రేమకావ్యంగా వచ్చింది

    దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి రూపొందించిన ప్రేమకథా చిత్రమే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు.

    ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!ఫస్ట్ డే ఫస్ట్ షో ట్విట్టర్ రివ్యూ: సినిమాకు షాకింగ్ టాక్.. ఏది ప్లస్ అవ్వాలో అదే మైనస్‌గా!

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి దీనికి రూ. 16.20 కోట్లు బిజినెస్ అయింది.

    28వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    28వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    ఆంధ్ర, తెలంగాణలో 28వ రోజు 'సీతా రామం' మూవీకి కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 17 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ వసూలు చేసింది.

    రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్రంగరంగ వైభవంగా ట్విట్టర్ రివ్యూ: వైష్ణవ్ తేజ్ మూవీకి ఊహించని టాక్.. అసలైందే మిస్ అవడమే మైనస్

    4 వారాలకు కలిపి ఎంత వచ్చింది

    4 వారాలకు కలిపి ఎంత వచ్చింది

    ఏపీ, తెలంగాణలో 4 వారాల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.47 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.93 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.57 కోట్లు, కృష్ణాలో రూ. 1.72 కోట్లు, నెల్లూరులో రూ. 87 లక్షలతో కలిపి రూ. 22.30 కోట్లు షేర్, రూ. 39.57 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    4 వారాల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 22.30 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.00 కోట్లు, మిగితా భాషల్లో రూ. 7.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 28 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 40.01 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 80.75 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!HBD Pawan Kalyan: పవన్‌కు అన్ని కోట్ల ఆస్తులు.. ఇండియాలోనే ఇదో రికార్డు.. ఆమె వల్లే సినిమాల్లోకి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    అందమైన ప్రేమకావ్యంగా వచ్చిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 4 వారాల్లోనే దీనికి రూ. 40.01 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.01 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    సీతా రామంకు సంచలన వసూళ్లు

    సీతా రామంకు సంచలన వసూళ్లు

    మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - మృణాల్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా నాలుగు వారంల్లోనూ ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తాజాగా రూ. 40 కోట్ల షేర్ మార్కును చేరుకుంది. తద్వారా అదిరిపోయే రికార్డును ఖాతాలో వేసుకుంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 40.01 Cr in 4 Weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X