Sita Ramam 6 Days Collections: సీతా రామం హిట్.. అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్.. పదో మూవీగా రికార్డు
పేరుకు మలయాళ హీరోనే అయినా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆయన.. 'మహానటి' చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రతో మరింత చేరువ అయ్యాడు. ఇక, ఇప్పుడు నేరుగా మరో తెలుగు సినిమాలో నటించాడు. అదే 'సీతా రామం'. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ సినిమా.. ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనుకున్నట్లుగానే దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ ఆరు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

క్యూట్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమా
దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కాంబోలో వచ్చిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు. ఇది మూడు భాషల్లో విడుదలైంది.

సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్
'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

ఆరో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు
ఆంధ్ర, తెలంగాణలో 'సీతా రామం' మూవీకి 6వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 91 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకు కలిపి ఎంతొచ్చింది
'సీతా రామం' మూవీకి 6 రోజుల్లో ఏపీ, టీఎస్‌లో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.06 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.54 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 62 లక్షలు, గుంటూరులో రూ. 73 లక్షలు, కృష్ణాలో రూ. 83 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో కలిపి రూ. 10.28 కోట్లు షేర్, రూ. 18.95 కోట్లు గ్రాస్ వసూలైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 6 రోజుల్లో రూ. 10.28 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.85 కోట్లు, మిగితా భాషల్లో రూ. 2.85 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 18.03 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.60 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లోనే దీనికి రూ. 18.03 కోట్లు వచ్చాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.03 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

టాలీవుడ్‌లో 10వ సినిమా రికార్డు
'సీతా రామం' మూవీ ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ అయింది. దీంతో 2022లో 'బంగార్రాజు', 'డీజే టిల్లు', 'RRR', 'డాన్', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'మేజర్', 'విక్రమ్', 'విక్రాంత్ రోణ', 'బింబిసార' తర్వాత హిట్ అయిన పదో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. అలాగే, ఆరో స్ట్రయిట్ తెలుగు సినిమాగా ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











