For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sita Ramam 6 Weeks Collections: అమ్మింది 17 కోట్లకు.. వసూళ్లు మాత్రం మూడు రెట్లు.. హిందీలో కూడా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీంతో అలాంటి చిత్రాలను అభిమానించే సినీ ప్రియులంతా నిరాశగా ఉండిపోయారు. అంతేకాదు, ప్యూర్ లవ్ స్టోరీతో కూడిన చిత్రాల కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అలా కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఇక, ఇప్పుడు ఓటీటీలో విడుదలైన ఇది సత్తా చాటుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ ఆరు వారాల రిపోర్టును చూద్దాం పదండి!

  ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సీతా రామం

  ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సీతా రామం

  దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'సీతా రామం'. ఈ మూవీలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. దీనికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్, స్వప్న దత్ నిర్మించారు.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

  సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

  సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

  పూర్తి స్థాయి ప్రేమకథతో వచ్చిన 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి టోటల్‌గా రూ. 16.20 కోట్లు బిజినెస్ అయింది.

  ఓటీటీలో వచ్చినా థియేటర్లలోనూ

  ఓటీటీలో వచ్చినా థియేటర్లలోనూ

  సున్నితమైన కథతో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'సీతా రామం' మూవీకి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో ఇది నెల రోజులుగా హవాను చూపించింది. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ ఓటీటీలో మొదలైంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వసూళ్లును రాబడుతూ ముందుకు సాగుతోంది.

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

  6 వారాలకు కలిపి ఎంత వచ్చింది

  6 వారాలకు కలిపి ఎంత వచ్చింది

  ఏపీ, తెలంగాణలో 6 వారాల్లో 'సీతా రామం'కు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.05 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.97 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.62 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.02 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.28 కోట్లు, గుంటూరులో రూ. 1.66 కోట్లు, కృష్ణాలో రూ. 1.81 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలతో కలిపి రూ. 23.34 కోట్లు షేర్, రూ. 41.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

  ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

  ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

  6 వారాల్లో తెలుగులో రూ. 23.34 కోట్లు రాబట్టిన 'సీతా రామం' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.26 కోట్లు, మిగితా భాషల్లో రూ. 8.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 42 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.80 కోట్లు షేర్‌, రూ. 90.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

  Saakini Daakini Twitter Review: రెజీనా, నివేదా మూవీకి ఊహించని టాక్.. అది కూడా వర్కౌట్ అయితే మాత్రం!

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

  స్వచ్చమైన ప్రేమకథతో రూపొందిన 'సీతా రామం'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు వారాల్లోనే దీనికి రూ. 43.80 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 26.80 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

  హిందీలో ఇప్పటికీ రాబడుతూనే

  హిందీలో ఇప్పటికీ రాబడుతూనే

  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కింది. మరీ ముఖ్యంగా హిందీలో విడుదలైన తర్వాత ఇది మంచి వసూళ్లను రాబడుతూ వస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ సినిమా అక్కడ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. దీంతో నార్త్ ఇండియాలో ఇప్పటికే రూ. 2 కోట్లకు పైగా షేర్‌తో సత్తా చాటుకుంది.

  English summary
  Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 43.80 Cr in 6 Weeks.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X