For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sita Ramam 9 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లోనే అంతా.. మరో రికార్డుకు చేరువ

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు నెలల పాటు సరైన సక్సెస్‌లు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమానే 'సీతా రామం'. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా అసలు జనాలు థియేటర్లకే రాని పరిస్థితుల్లో విడుదలై.. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుంది. ఫలితంగా ఈ మూవీ వారం రోజుల లోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకుని హిట్ అయింది. అయితే, రెండో వారం ప్రారంభంలో ఈ మూవీకి కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. మళ్లీ ఈ శుక్రవారం నుంచి వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 9వ రోజైన శనివారం కలెక్షన్లు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

    ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం

    ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన సీతా రామం

    దుల్కర్ సల్మాన్ - హను రాఘవపూడి కలయికలో వచ్చిన సినిమానే 'సీతా రామం'. మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో బడా ప్రొడ్యూసర్ సీ అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించారు.

    ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ: అందాలన్నీ కనిపించడంతో ఇబ్బంది

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    సీతా రామం మూవీ బిజినెస్ డీటేల్స్

    ఆరంభం నుంచే ఉన్న బజ్ వల్ల 'సీతా రామం' మూవీకి నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.50, మిగిలిన భాషల్లో రూ. 1.50 కోట్లతో కలిపి ఈ మూవీకి రూ. 16.20 కోట్ల బిజినెస్ అయింది.

    9వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు

    9వ రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు


    'సీతా రామం' మూవీకి ఆంధ్ర, తెలంగాణలో 9వ రోజు కలెక్షన్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 34 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రూ. 84 లక్షలు షేర్, రూ. 1.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్: స్నానం చేస్తోన్న ఫొటోలతో సంచలనం

    9 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    9 రోజులకు కలిపి ఎంత వచ్చింది

    'సీతా రామం'కు 9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.92 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.33 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.98 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.13 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 75 లక్షలు, గుంటూరులో రూ. 87 లక్షలు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 49 లక్షలతో కలిపి రూ. 12.50 కోట్లు షేర్, రూ. 22.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది?

    9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 12.50 కోట్లు రాబట్టిన 'సీతా రామం' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.80 కోట్లు, మిగితా భాషల్లో రూ. 3.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 22.10 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 43.40 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

    ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'సీతా రామం' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 17 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లోనే దీనికి రూ. 22.10 కోట్లు వసూలు అయ్యాయి. అంటే ఈ మూవీకి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.10 కోట్లు లాభాలు కూడా దక్కాయి.

    మరో రికార్డుకు చేరువైన సీతా రామం

    మరో రికార్డుకు చేరువైన సీతా రామం


    'సీతా రామం' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఫలితంగా అక్కడ ఈ చిత్రం 9 రోజుల్లోనే 925K డాలర్లను రాబట్టింది. తద్వారా 1 మిలియన్ మార్కుకు చేరువ అయింది. ఇక, ఆదివారమే ఈ రికార్డును ఈ చిత్రం దాటేసే అవకాశం ఉంది.

    English summary
    Dulquer Salmaan Did Sita Ramam Movie Under Hanu Raghavapudi Direction. This Movie Collect 22.10 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X