Sita Ramam Pre Release Business: బాక్సాఫీస్ వద్ద బిగ్ టార్గెట్.. దుల్కర్ సల్మాన్ తో సాధ్యమేనా?
ఆగస్టు నెలలో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ నెల మొదటి వారంలో ఆగస్టు 5న విడుదల కానున్న సీతారామం సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓవర్గం ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నట్లు సోషల్ మీడియాలో హడావిడి చూస్తేనే అర్థమవుతుంది. దుల్కర్ సల్మాన్ మహానటి తర్వాత నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో మృణల్ ఠాగూర్ రష్మిక మందన్న కూడా నటించారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

మంచి రెస్పాన్స్
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ తో పాటు మహానటి వంటి సినిమాను నిర్మించిన స్వప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం సీతారామం. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై తెలుగులో మంచి అంచనాలను క్రియేట్ అయ్యాయి. ప్రమోషన్స్ చేసేందుకు దుల్కర్ ఎక్కడికి వెళ్లినా కూడా జనాలు ఒక రేంజ్ లో బ్రహ్మరథం పడుతున్నారు. చూస్తుంటే ఒపెనింగ్స్ ఉహించినదానికంటే ఎక్కువే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అతని మీద నమ్మకంతో
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాధ, లై, పడి పడి లేచి మనసు.. చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువగానే పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడి ఇంతకుముందు తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నష్టాలను కలుగజేశాయి. అయినప్పటికీ అతని టాలెంట్ మీద నమ్మకంతో వైజయంతి మూవీస్ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మేకింగ్ విజువల్స్ చూస్తేనే సినిమా అవుట్ ఫుట్ బ్రహ్మాండంగా వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో ఈవెంట్
ఇక దుల్కర్ సల్మాన్ పై నమ్మకంతో టాలీవుడ్ లో మంచి బిజినెస్ జరిగింది. అలాగే ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా విఉదలైన టీజర్ ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రభాస్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు. నేడు హైదరాబాద్ లో ఈవెంట్ కు వేదికను సిద్ధం చేయగా ఫ్యాన్స్ కు ఎవరికి కూడా ఎంట్రీ ఇవ్వకుండా ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సీతారామం సినిమా నైజాంలో అత్యధికంగా 5 కోట్ల వరకు అమ్ముడవ్వగా సీడెడ్ 2కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 14 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం కర్నాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 70 లక్షల వరకు బిజినెస్ చేసిందట. ఓవర్సీస్ 2.5 కోట్ల ధర పలికిన ఈ సినిమా ఆ టార్గెట్ జూ తొందరగానే అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 18.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19.50 కోట్లు. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











