King of Kotha Collections దుల్కర్ సల్మాన్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు..కింగ్ ఆఫ్ కోతాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే

దక్షిణాదిలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రసన్న, షబ్బీర్, అనికా సురేంద్రన్, శరణ్ శక్తి తదితరులు నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోతా. వేఫారెర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. మలయాళం, తమిళ, తెలుగు, భాషల్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కింగ్ ఆఫ్ కోతా మూవీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా ఈ సినిమాను 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొంటే ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడటంతో రికార్డు స్థాయి స్క్రీన్ కౌంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ చేశాడు.

Dulquer Salmaans King of Kotha movie day 1 Collections worldwide

కింగ్ ఆఫ్ కోతా మూవీ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మలయాళంలో భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ సిిమాకు మలయాళంలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కోచి, త్రివేండ్రం,కోజికోడ్, త్రిచూర్, అలెప్పి ప్రాంతాల్లో 70 నుంచి 90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మలయాళ వెర్షన్‌కు హైదరాబాద్‌లో 35 శాతం, బెంగళూరులో 40 శాతం, ఢిల్లో 45 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

కింగ్ ఆఫ్ కోతా తమిళ వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 35 శాతం, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో 40 శాతం, పాండిచ్చేరి 90 శాతం, దిండిగల్ 40 శాతం, త్రిచీ 45 శాతం, హైదరాబాద్‌లో 90 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.

Dulquer Salmaans King of Kotha movie day 1 Collections worldwide

కింగ్ ఆఫ్ కోతా తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో ఇతర సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ అంతంతా మాత్రంగానే ఉంది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరు 45 శాతం, వైజాగ్‌లో 35 శాతం, కాకినాడలో 40 శాతం, తిరుపతిలో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

కింగ్ ఆఫ్ కోతా కలెక్షన్ల విషయానికి వస్తే.. కేరళలో భారీ కలెక్షన్లు సాధించగా, తమిళ, తెలుగు భాషల్లో ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేరళలో 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే.. తెలుగు, తమిళం, ఇతర ప్రాంతాల్లో కలిపి 2 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో దక్షిణాదిలో 9 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కలెక్షన్లు కలిపితే 11 నుంచి 12 కోట్ల వరకు తొలి రోజు కలెక్షన్లు ఉన్నాయి.

Dulquer Salmaans King of Kotha movie day 1 Collections worldwide

కింగ్ ఆఫ్ కోతా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 70 కోట్ల రూపాయలు. ఈ సినిమా తొలి రోజు దాదాపు 15 శాతానికిపైగా రెవెన్యూ రాబట్టింది. వారాంతంలో భారీ వసూళ్లు రాబడితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకొనే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా ఏ మేరకు లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X