King of Kotha Day2 Collections: దుల్కర్ కెరియర్‌లోనే దారుణమైన కలెక్షన్స్… ఇలా అయితే కష్టమే సామీ!
పాన్ ఇండియా సినిమా ఒక్కటి తీయకపోయినా... పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయనకు అన్ని భాషల్లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ఇప్పటికే ఆయన తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి.. స్టార్ హీరో అయితే అయ్యారు. ఇక ఆయన తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాగా... డే వన్ కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ఇక డే 2 కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే....
దక్షిణాదిలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రసన్న, షబ్బీర్, అనికా సురేంద్రన్, శరణ్ శక్తి తదితరులు నటించిన చిత్రం కింగ్ ఆఫ్ కోతా. వేఫారెర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. మలయాళం, తమిళ, తెలుగు, భాషల్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచేసింది.

కింగ్ ఆఫ్ కోతా మూవీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా ఈ సినిమాను 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్ ఖర్చులు కలుపుకొంటే ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడటంతో రికార్డు స్థాయి స్క్రీన్ కౌంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
కింగ్ ఆఫ్ కోతా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 70 కోట్ల రూపాయలు. ఈ సినిమా తొలి రోజు దాదాపు 15 శాతానికిపైగా రెవెన్యూ రాబట్టింది. వారాంతంలో భారీ వసూళ్లు రాబడితే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకొనే అవకాశం కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కోతా కలెక్షన్ల విషయానికి వస్తే.. కేరళలో భారీ కలెక్షన్లు సాధించగా, తమిళ, తెలుగు భాషల్లో ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా కేరళలో 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేస్తే.. తెలుగు, తమిళం, ఇతర ప్రాంతాల్లో కలిపి 2 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో దక్షిణాదిలో 9 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో కలెక్షన్లు కలిపితే 11 నుంచి 12 కోట్ల వరకు తొలి రోజు కలెక్షన్లు ఉన్నాయి.

ఇక రెండో రోజు కింగ్ ఆఫ్ కోతా కలెక్షన్స్ విషయానికి వస్తే... మలయాళంలో భాగానే కలెక్షన్స్ సాధించగా.. మిగతా భాషల్లో మాత్రం కలెక్షన్లను రాబట్టలేకపోతుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు రూ.9.10 కోట్లను రాబట్టిందని ట్రెడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా ఇండియావైడ్ గా రూ.6.6 నెట్ రాబట్టగా... రూ8.3కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రెండు రోజుల్లో రూ.16.8 రాబట్టిందని సమాచారం. ఇక బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఈ సినిమాకు కష్టమే అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











