Lucky Baskhar Day 3 Collections : దుల్కర్ ఊచకోత.. 50 కోట్ల దిశగా, లక్కీ భాస్కర్‌కి మూడో రోజు ఎన్ని కోట్లంటే?
యువ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ అంచనాలకు మించి రాణిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ తొలిరోజు ఓపెనింగ్స్ రాబట్టిన దుల్కర్ సల్మాన్ తెలుగు నాట ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపిస్తున్నాడు. తెలుగులో రిలీజైన అన్ని సినిమాలపై లక్కీ భాస్కర్ డామినేట్ చేస్తున్నాడు. మరి మూడో రోజు దుల్కర్ సల్మాన్ ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే .
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ గత సినిమాలు , క్లీన్ ఇమేజ్, తెలుగు నాట ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ సినిమాని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లక్కీ భాస్కర్ రూ. కోటికి పైగా రాబట్టగా.. తొలి రోజున దుల్కర్ సల్మాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వసూళ్ల వేటను ధాటిగా ప్రారంభించింది.
ఇక మూడో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే .. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.63 కోట్లు, తమిళ్‌లో రూ. 91 లక్షలు, మలయాళంలో రూ. 2.27 కోట్లు, కన్నడలో రూ. 36 లక్షల చొప్పున మొత్తంగా మూడో రోజు లక్కీ భాస్కర్ రూ. 10 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఓవర్సీస్ కూడా కలుపుకుని మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ ఆదివారంతో వీకెండ్ ముగుస్తుండగా దుల్కర్ సల్మాన్ ఏ రేంజ్‌లో వసూలు చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











