Lucky Baskhar Day 4 Collections: దుల్కర్ మాస్ ర్యాంపెజ్..ఫస్ట్ డేకి మించి కలెక్షన్స్,4వ రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ఫస్ట్ వీకెండ్‌ను ఘనంగా క్లోజ్ చేసింది. టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ తెలుగు నాట బిగ్గెస్ట్ హిట్‌గా లక్కీ భాస్కర్ నిలిచినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఇదే జోరులో నాలుగో రోజు దుల్కర్ సల్మాన్ ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే .

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Dulquer Salmaan s Lucky Baskhar Day 4 Collections here s the details

దుల్కర్ సల్మాన్ గత సినిమాలు , నటుడిగా క్లీన్ ఇమేజ్, తెలుగు నాట యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్‌ మూవీ బడ్జెట్ రూ.100‌ కోట్లుగా ఫిలింనగర్ టాక్.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ఫిలింనగర్ టాక్. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్‌గా విలువ కట్టారు. ఆదివారం వీకెండ్ చివరి రోజు కావడంతో ఓపెనింగ్ డేకి మించి బుకింగ్స్ అందుకున్నారు దుల్కర్ సల్మాన్. ఫ్యామిలీ ఆడియన్స్, యువత పెద్ద సంఖ్యలో థియేటర్‌లలో సందడి చేశారు. తెలుగుతో పాటు మలయాళంలోనూ ఆదివారం ఎక్స్‌లెంట్ హోల్డ్ అందుకున్నారు దుల్కర్.

Dulquer Salmaan s Lucky Baskhar Day 4 Collections here s the details

నాలుగో రోజు వసూళ్ల విషయానికి వస్తే .. తెలుగు రాష్ట్రాల్లో రూ 6.10 కోట్లు, తమిళంలో రూ. 1.03 కోట్లు, మలయాళంలో రూ. 3.06 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. కోటి చొప్పున మొత్తంగా వరల్డ్ వైడ్‌గా రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు దుల్కర్ సల్మాన్. మొత్తంగా నాలుగు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాడు లక్కీ భాస్కర్. ఇందులో ఒక్క తెలుగు నుంచే దాదాపు రూ. 22 కోట్లకు పైగా గ్రాస్ రావడం విశేషం. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలుకావడంతో దుల్కర్ మూవీ ఏ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Read more about: dulquer salmaan lucky baskhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X