Lucky Baskhar Day 5 Collections : 4 రోజుల్లో 55 కోట్లు ఔట్ .. దుల్కర్ మాస్ జాతర, ఐదవ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్‌ని ఘనంగా క్లోజ్ చేసిన లక్కీ భాస్కర్ 50 శాతం మేర రికవరీ సాధించి టార్గెట్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. లాంగ్ వీకెండ్ ముగిసి సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలు కావడంతో దాని ప్రభావం దుల్కర్ సల్మాన్ మూవీపై పడిందా? లక్కీ భాస్కర్ 5వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించాడో చూస్తే.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

దుల్కర్ సల్మాన్ ఇమేజ్, తెలుగు నాట యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లుగా ఫిలింనగర్ టాక్.
తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ మూవీ. ఈ నేపథ్యంలో లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్‌గా విలువ కట్టారు. తొలి నాలుగు రోజుల్లోనే లక్కీ భాస్కర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 48.4 కోట్ల గ్రాస్.. రూ.23.54 కోట్ల షేర్‌ను రాబట్టింది.

ఇందులో నైజాం రూ. 9.2 కోట్లు, ఆంధ్ర రూ.6.7 కోట్లు, సీడెడ్ రూ. 2.3 కోట్లు, తమిళనాడు రూ. 3.4 కోట్లు, కేరళ రూ. 8.6 కోట్లు, కర్ణాటక రూ. 2.7 కోట్లు, హిందీ రూ. 60 లక్షలు, ఓవర్సీస్ రూ.15 కోట్లు లెక్కన రాబట్టి దీపావళికి మెగా హిట్‌గా నిలిచింది. అయితే లక్కీ భాస్కర్ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 55.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అఫిషీయల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇక ఐదో రోజు లక్కీ భాస్కర్ కలెక్షన్స్ విషయానికి వస్తే .. సోమవారం వర్కింగ్ డే ప్రభావం గట్టిగా పడటంతో బుకింగ్స్‌లో దాదాపు 50 శాతం మేర డ్రాప్స్ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.10 కోట్లు, తమిళ్‌లో రూ. 67 లక్షలు, మలయాళం రూ. 1.34 కోట్లు , కన్నడంలో రూ. 13 లక్షల చొప్పున మొత్తంగా 5వ రోజు దుల్కర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఆరో రోజైన మంగళవారం లక్కీభాస్కర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











