Lucky Baskhar Day 7 Collections : స్లో అండ్ స్టడీగా కుమ్మేస్తోన్న లక్కీ భాస్కర్.. 7వ రోజు దుల్కర్ మూవీకి
వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఫస్ట్ వీకెండ్‌లో కలెక్షన్లను కుమ్మిపడేసిన దుల్కర్ తర్వాత వర్క్ డేస్‌లోనూ దుమ్మురేపుతున్నారు. ఆరు రోజుల్లోనే రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన లక్కీ భాస్కర్.. ఆ జోరును కొనసాగిస్తున్నాడా? 7వ రోజు దుల్కర్ సల్మాన్ మూవీ ఎన్నికోట్లు రాబట్టిందంటే?
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్ మూవీ బడ్జెట్ రూ.100 కోట్లుగా ఫిలింనగర్ టాక్. ఇందులో తమిళ నటుడు రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

డబ్బింగ్ సినిమాలకు తోడు సీతారామం, మహానటి చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఇమేజ్ తెలుగునాట శిఖరాగ్రానికి చేరింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత ఆయన చిత్రాలంటే పడి చస్తున్నారు. ఈ క్రమంలోనే లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది .
ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. తొలి వారం మంచి వసూళ్లు సాధించిన లక్కీ భాస్కర్ ఆరు రోజుల వరకు రూ. 67.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్‌లో పోస్టర్ రిలీజ్ చేసింది. పాజిటివ్ టాక్ దృష్ట్యా ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమా షోలను తమిళనాడులో పెంచుకుంటూ వచ్చారు. తొలి రోజు కేవలం 75 షోలే వేయగా.. ఆరో రోజు నాటికి 534 షోలకు పెంచారంటే లక్కీ భాస్కర్ ప్రభంజనం అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఏడో రోజు లక్కీ భాస్కర్ కలెక్షన్స్ విషయానికి వస్తే .. రిలీజైన వారానికి కూడా స్లో అండ్ స్టడీగా కుమ్ముతున్నాడు దుల్కర్ సల్మాన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ లక్కీ భాస్కర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. కేరళ, తమిళనాడులలోనూ బుకింగ్ బాగుంటున్నాయి. ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.91 ట్లు, తమిళ్‌లో రూ. 68 లక్షలు, మలయాళం రూ .89 లక్షలు , కన్నడంలో రూ. 7 లక్షల చొప్పున మొత్తంగా 7వ రోజు దుల్కర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 4 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ఏడో ఎనిమిదో రోజైన గురువారం లక్కీభాస్కర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











