Lucky Baskhar Day 8 Collections : వీక్ డేస్‌లోనూ దుల్కర్ హవా .. 8వ రోజు లక్కీ భాస్కర్‌కు ఎన్ని కోట్లంటే?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది . తొలి వారం కలెక్షన్లను కుమ్మిపడేసిన ఈ సినిమా.. వర్కింగ్ డేస్‌లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ. 65 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన దుల్కర్ సల్మాన్.. బ్రేక్ ఈవెన్ దిశగా లాక్కెళ్తున్నాడు. మరి 8వ రోజు లక్కీ భాస్కర్ ఎన్ని కోట్లను రాబట్టాడో చూస్తే ..

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రచార కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్‌ మూవీ బడ్జెట్ రూ.100‌ కోట్లుగా ఫిలింనగర్ టాక్. ఇందులో తమిళ నటుడు రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Dulquer Salmaan s Lucky Baskhar Day 8 Collections here s the details

మలయాళ హీరో అయినప్పటికీ డీసెంట్ మూవీస్‌తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. తండ్రి మమ్ముట్టికి ఉన్న క్రేజ్‌కి మించి సాధించాడు ఈ కుర్రాడు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దుల్కర్‌ను మహానటి మూవీ బాగా చేరువ చేసింది. ఆ వెంటనే హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం మరో మెట్టుపైకెక్కించింది. ఆ తర్వాత మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఏ సినిమా చేసినా తెలుగులో ఖచ్చితంగా రిలీజ్ కావాల్సిందే.

దుల్కర్ సల్మాన్ క్రేజ్ దృష్ట్యా లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌‌ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది . ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్‌ రాబట్టాలని విలువ కట్టారు.

Dulquer Salmaan s Lucky Baskhar Day 8 Collections here s the details

లక్కీ భాస్కర్ ఆరు రోజుల వరకు రూ. 67.6 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎక్స్‌లో పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఎనిమిదో రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందో చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.63 ట్లు, తమిళ్‌లో రూ. 69 లక్షలు, మలయాళం రూ .66 లక్షలు , కన్నడంలో రూ. 6 లక్షల చొప్పున మొత్తంగా 7వ రోజు దుల్కర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 3.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటంతో లక్కీభాస్కర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: dulquer salmaan lucky baskhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X