Lucky Baskhar Day 1 Box Office: ఇది దుల్కర్ మార్క్ ఊచకోత .. లక్కీ భాస్కర్‌‌కి తొలి రోజు ఎన్ని కోట్లంటే ?

దుల్కర్ సల్మాన్ సినిమా అంటే అందులో ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉండే ఉంటుందని ప్రేక్షకుల్లో బలమైన ముద్ర పడిపోయింది. మలయాళ హీరో అయినప్పటికీ తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు ఈ కుర్రాడు. సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్‌కు తెలుగు నాట ఇమేజ్ తారాస్థాయికి చేరింది. తాజాగా ఆయన నటించిన మూవీ లక్కీ భాస్కర్ .. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల ఓపెనింగ్స్ రాబడుతుందోనని దుల్కర్ అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై పాపులర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. రామ్‌కీ, మానస చౌదరి, హైపర్ ఆది, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ తదితరులు కీలకపాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ మూవీని తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

dulquer salmaan s lucky bhaskar Day 1 Collections here s the details

దుల్కర్ సల్మాన్ గత సినిమాలు క్లీన్ హిట్ కావడంతో లక్కీ భాస్కర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 15 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషన్ కార్యక్రమాలు, ఇతర ఖర్చులు కలుపుకుని లక్కీ భాస్కర్‌ మూవీని రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక , కేరళ , హిందీ, ఓవర్సీస్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీని సుమారుగా 1100 స్క్రీన్లలో ఇండియాలో, 1500 స్క్రీన్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే కనీసం రూ.35 కోట్ల షేర్ .. రూ.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది.

dulquer salmaan s lucky bhaskar Day 1 Collections here s the details

దుల్కర్ గత సినిమాల రికార్డుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో లక్కీ భాస్కర్‌కు దాదాపు 150కి పైగా ప్రీమియర్ షోలు పడినట్లుగా ఫిలింనగర్ టాక్. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో లక్కీ భాస్కర్‌‌ రూ. కోటికి పైగా రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలి రోజున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.5. 35 కోట్లు, తమిళనాడులో రూ. 60 లక్షలు, మలయాళంలో రూ. 3.10 కోట్లు, కర్ణాటకలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.30 లక్షల వసూళ్లు సాధించింది. మొత్తంగా దుల్కర్ సల్మాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 10 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వసూళ్ల వేటను ధాటిగా ప్రారంభించింది. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ మూడు రోజుల్లో లక్కీ భాస్కర్ ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: dulquer salmaan lucky baskhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X