1600 కోట్ల బడ్జెట్.. 5300 కోట్ల కలెక్షన్లు సాధించిన మూవీ ఎంటో తెలుసా?

అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్యూన్‌ పార్ట్ 2 మూవీ సంచలన విజయం సాధించింది. గత ఏడాది విడుదలైన హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్‌లో 2021 సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన డ్యూన్: పార్ట్ 1 సినిమాకు సీక్వెల్‌గా డ్యూన్ 2 రూపొందింది. డ్యూన్ 1 మూవీని సుమారుగా 165 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే సుమారుగా 1400 కోట్లకుపైగా నిర్మిస్తే.. డ్యూన్ పార్ట్ 2 సినిమాను 190 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా 1600 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Dune Part 2 Closing Collections Worldwide Dune Sequel crossed 5300 Crores Mark

డ్యూన్ పార్ట్ 1 మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రమోషనల్ దశలోనే క్రేజీగా బజ్ క్రియేట్ చేసుకొన్నది. ట్రైలర్ ప్రోమోలు, ప్రమోషనల్ కార్యక్రమాలు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమా రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాలకు మిన్నగా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా క్రేజ్‌ను కొనసాగించింది. అన్ని దేశాల్లోనూ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డ్యూన్ పార్ట్ 2 చిత్రానికి ఇండియాలో ఓ మోస్తారు రియాక్షన్ కనిపించింది. ఈ మూవీ తొలి వారం ముగిసే సమయానికి ఇంగ్లీష్ వెర్షన్ 15 కోట్లు, హిందీ వెర్షన్ 2 కోట్ల రూపాయలతో మొత్తంగా 17 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక రెండో వారంలో 6.5 కోట్లు, మూడో వారంలో 3 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. నాలుగో వారంలో ఈ చిత్రం 2 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం మొత్తంగా 28 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

Dune Part 2 Closing Collections Worldwide Dune Sequel crossed 5300 Crores Mark

డ్యూన్ పార్ట్ 2 సినిమాకు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ సినిమా మొత్తంగా 3200 కోట్ల రూపాయలు విదేశీ మార్కెట్‌లో రాబట్టింది. ఇక గత నాలుగు వారాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5300 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఇటీవల కాలంలో హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది.

డ్యూన్ 2 మూవీ సుమారుగా 2000 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమా రెండోవారంలోనే లాభాల్లోకి ప్రవేశించింది. ట్రేడ్ అంచనాలను మించి వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో పెద్దగా స్పందన కనిపించకపోయినా.. విదేశాల్లో ఈ సినిమా సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X