Dune Part 2 Collections 1600 కోట్ల బడ్జెట్.. రికార్డు వసూళ్లు.. 4 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్యూన్ పార్ట్ 2 సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది. హాలీవుడ్‌లో భారీ విజయాలు అందుకొన్న బార్సీ, ఓప్పెన్‌హైమర్ సినిమాలతో పోటీపడుతూ కలెక్షన్లు సాధిస్తున్నది. తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ తదితరులు నటించిన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలే కాకుండా సాధారణ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సాధిస్తున్న వసూళ్ల వివరాలు, బడ్జెట్, బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే...
డ్యూన్: పార్ట్ 2 సినిమా విషయానికి వస్తే.. 2021 సంవత్సరంలో విడుదలైన డ్యూన్: పార్ట్ 1 సినిమాకు సీక్వెల్. డ్యూన్ సుమారుగా 165 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే సుమారుగా 1400 కోట్లకుపైగా నిర్మిస్తే.. డ్యూన్ 2 సినిమాను 190 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా 1600 కోట్ల రూపాయలతో నిర్మించారు.

డ్యూన్: పార్ట్ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ మూవీ వసూళ్లు ఊపందుకొన్నాయి. ప్రీమియర్స్ రోజు 1 కోటి రూపాయలతో ప్రారంభమైన ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ రోజు రోజుకు పెరుగుతున్నది. తొలి రోజు 3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో తొలి వారాంతంలో 12 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
Recommended Video

ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ప్రేక్షకులు తొలివారాంతం వరకు భారీగా ఆదరించారనే విషయం కలెక్షన్లు వెల్లడించాయి. ఈ సినిమా ఉత్తర అమెరికా అంటే కెనడా, అమెరికాలో ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలకిందులు చేసింది. ఈ సినిమా మూడు రోజుల్లో 85 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఒక అమెరికేతర దేశాల్లో ఈ సినిమా వసూళ్ల హవా కొనసాగింది. ఈ సినిమా యూకే, యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో కలిపి 100 మిలియన్లకుపైగా వసూళ్లను సాధించింది.

ఇక ఇండియాలో తొలివారాంతం తర్వాత డ్యూన్ 2 సినిమా నిలకడగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా సోమవారం అంటే నాలుగో రోజున 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 14 కోట్లకు మేర కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. దాంతో ఈ సినిమా భారీ వసూళ్లపై కన్నేసినట్టు కనిపిస్తున్నది.
డ్యూన్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఇండియా, నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 200 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ కరెన్సీలో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 1650 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా లాభాలకు చేరువలో ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











