Dune Part 2 Collections డ్యూన్ పార్ట్ 2కు కలెక్షన్ల సునామీ.. రికార్డుల మోత.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

వరల్డ్ సినిమా రంగంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందిన చిత్రం డ్యూన్: పార్ట్ 2. ఈ మూవీ మార్చి 1వ తేదీన రిలీజైంది. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

2021 సంవత్సరంలో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా డ్యూన్ పార్ట్ 2 రిలీజైంది. ఈ సినిమాను ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించడంతో భారీగానే ఖర్చు అయింది. ఈ సినిమాను సుమారుగా 190 మిలియన్ల డాలర్లతో తెరకెక్కించారు. భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Dune Part 2 Expected Box Office Collections Worldwide Denis Villeneuve Movie opens Record level at International market

డ్యూన్: పార్ట్ 2 సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగానే థియేట్రికల్ రిలీజ్ చేశారు. పెయిడ్ ఫ్రీమియర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. దాదాపు 42 దేశాల్లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశఆరు. అయితే ఈ సినిమాకు అమెరికాతోపాటు జర్మనీ, ఆస్ట్రేలియా, మెక్సికో, పోలాండ్, బ్రెజిల్ దేశాల్లో మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా ప్రివ్యూల ద్వారా 2.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవర్సీస్ మార్కెట్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి 1.3 మిలియన్లు, మెక్సికోలో 696K, పోలెండ్‌లో 361K, బ్రెజిల్‌లో 331K, ఫ్రాన్స్‌లో 3.5 మిలియన్ డాలర్లు, జర్మనీలో 2.4 మిలియన్ డాలర్లు, ఆస్ట్రేలియాలో 1.3 మిలియన్ డాలర్లు, తైవాన్, ఇటలీలో 1.1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Dune Part 2 Expected Box Office Collections Worldwide Denis Villeneuve Movie opens Record level at International market

ఇదిలా ఉండగా, నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద డ్యూన్ పార్ట్ 2 చిత్రం రికార్డులను సృష్టిస్తున్నది. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 18 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తొలి వారాంతానికి ఈ సినిమా 90 మిలియన్ డాలర్ల కలెక్షన్లు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఒప్పెన్ హైమర్ కలెక్షన్లను మంచి వసూళ్లను నమోదు చేస్తున్నది.

ఇక ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రీమియర్ల ద్వారా 70 లక్షల రూపాయల నికర వసూళ్లను నమ్దోదు చేసింది. ఇక తొలి రోజు ఈ సినిమా మొత్తంగా 3 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంగ్లీష్ వెర్షన్ 2.5 కోట్లు, హిందీ వెర్షన్ 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 3.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X