Dune Part 2 Collections: 5845 కోట్ల కలెక్షన్లు.. డ్యూన్ పార్ట్ 2 మూవీకి ఎన్ని ఆస్కార్స్ అంటే?

97వ అకాడెమీ అవార్డ్స్ వేడుక లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్ కోసం ప్రపంచ సినీ తారలు ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేళలకు మార్చి 3న ఉదయం ఆస్కార్స్ 2025 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో 'డూన్ : పార్ట్ 2' చిత్రం ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డ్ ను అందుకుంది. ప్రపంచ సినీ తారలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ 2025 అవార్డుల పండుగకు హాలీవుడ్ సినీ తారలు కదిలి వచ్చారు. డూన్ : పార్ట్ 2 టీమ్ కూడా ఈవెంట్ లో సందడి చేసింది. ఆయా విభాగాల్లో వచ్చిన అవార్డులను స్వీకరించారు.

'డూన్ : పార్ట్ 2'కు డెనిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో 2025 ఆస్కార్స్ అవార్డుల కోసం అకాడెమీకి దరఖాస్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో ఆస్కార్ బరిలో పోటీకి దిగింది. బెస్ట్ విజువల్ ఎఫ్టెక్ట్స్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వంటి ఐదు విభాగాల్లో నామినేషన్స్ లిస్ట్ లోనూ చేరింది. కానీ ఫైనల్ గా రెండు సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ కెటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. పాల్ లాంబెర్ట్, స్టీఫెన్ జేమ్స్, రైస్ సాల్కోంబ్, గెర్డ్ నెఫ్జర్ ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్‌ పై వర్క్ చేశారు. గారెత్ జాన్, రిచర్డ్ కింగ్, రాన్ బార్ట్‌లెట్, డగ్ హెంఫిల్ లు చిత్రానికి సౌండ్‌ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ విభాగాలలో ది బ్రూటలిస్ట్ చేతిలో ఓడిపోయింది.

Dune Part 2 Got Oscar 2025 Award in five Categories This film World Wide Collection Here is full Details

మొత్తానికి రెండు విభాగాల్లో 'డూన్ : పార్ట్ 2' చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కడంతో సినీ ప్రముఖులు, ప్రపంచ సినీతారల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. డూన్ : పార్ట్ 2 2024 మార్చి 1న యూనైటెడ్ స్టేట్స్ లో ఘనంగా విడుదలైంది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అంతే కాదు.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా షాకింగ్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆస్కార్స్ లో మెరిసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎన్నికోట్లు సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఈ చిత్రం 2024లో వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు చేసిన ఆరో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. డూన్: పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా 700.6 మిలియన్లు డాలర్ల గ్రాస్ ను అందుకుంది. ఇక ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు చూస్తే.. దేశీయ టిక్కెట్ల అమ్మకాల ద్వారా 278.3 మిలియన్లు డాలర్లు సంపాదించింది. విదేశీ మార్కెట్ల నుండి 422.3 మిలియన్ల డాలర్లు కలెక్ట్ చేసింది.

యూకే, యూఎస్, కెనడా నుంచి 48.8 మిలియన్ల డాలర్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అలాగే చైనా రెండో అతిపెద్ద మార్కెట్ నుంచి 48.5 మిలియన్ల డాలర్లు అందుకుంది. ఫ్రాన్స్ నుంచి రూ.42.6 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది. అలాగే జర్మనీని నుంచి రూ.39.7 మిలియన్లు డాలర్లు రాబట్టింది. ఆస్ట్రేలియాలో US 22.5 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. ప్రపంచం మొత్తంగా ఏప్రిల్ 28, 2024 నాటికి డూన్: పార్ట్ 2 ప్రపంచవ్యాప్తంగా 700.6 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది. ఇండియా లెక్కల ప్రకారం.. డూన్ : పార్ట్ 2 ప్రపంచ వ్యాప్తంగా రూ.5,845 కోట్లు, ఓవర్సీస్ లో రూ.3,520 కోట్లు, ఇండియాలో రూ.35.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో రూ.29.87 కోట్ల నెట్ వసూలైంది.

More from Filmibeat

Read more about: oscars 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X