Dunki Advance Booking Collections సలార్‌తో డంకీ మూవీకి గట్టిపోటి.. ఎన్ని కోట్ల కలెక్షన్లు అంటే?
మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఇడియెట్స్, సంజూ లాంటి చిత్రాలను నిర్మించిన రాజ్‌కుమార్ హిరాణి, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం డంకీ. దక్షిణాదితోపాటు హిందీలో రాణిస్తున్న తాప్సీ పొన్ను, అలాగే నటులు వికీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21వ తేదీన బ్రహ్మండంగా రిలీజ్ అవుతున్నది. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ అయింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. సలార్ సినిమాతో భారీ పోటిని ఎదుర్కొంటున్నది. దాంతో ఈ ఏడాది రిలీజైన జవాన్, పఠాన్, యానిమల్, టైగర్ 3, గదర్ 2, బ్రహ్మస్త్ర చిత్రాల మాదిరిగా కలెక్షన్లు నమోదు కాలేదనేది ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ చాలా స్లోగా మొదలవ్వడం కనిపించింది. అయితే కరెంట్ బుకింగ్ వల్ల కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

డంకీ సినిమాకు దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం దాదాపుగా 125,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోయాయి. పీవీఆర్ ఐనాక్స్‌లో 110000 టికెట్లు, సినీ పోలీస్ మల్టీప్లెక్స్‌లో 15 వేల టికెట్లు అమ్ముడుపోయాయి.
ఇక ఓవర్సీస్‌లో డంకీ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. నార్త్ అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో కలిపి ఈ సినిమా 500K డాలర్లు, యూఏఈ, మిడిల్ ఈస్ట్‌లో కలిపి 200K డాలర్లు, యూకేలో 100K పౌండ్స్ వసూలు చేసింది.

ఇక ఇండియాలో డంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. ఇండియాలో ఈ చిత్రం 10 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేస్తే...ప్రపంచవ్యాప్తంగా సుమారు ఈ సినిమా 20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తు న్నాయి. ఇంకా రెండు రోజులు వ్యవధి ఉంది కాబట్టి ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు వరల్డ్ వైడ్ రాబట్టే అవకాశం ఉంది.

డంకీ అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ మూవీ రికార్డు ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమా తొలి రోజున వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల షేర్.. 60 నుంచి 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











