Dunki Advance booking Collections రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన షారుక్.. 1000 కోట్లు గ్యారెంటీ అంటూ
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మరోసారి ప్రభంజనం సృష్టించేందుకు సిద్దమయ్యారు. పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ విజయాల తర్వాత డంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దేశంలోనే పాపులర్ డైరెక్టర్ రాజు కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా డంకీ డ్రాప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
జియో స్టూడియో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కుమార్ హిరాణి బ్యానర్లపై రాజ్ కుమార్ హిరాణి, గౌరీ ఖాన్ నిర్మిసత్ున్నారు. ఈ సినిమాకు కనికా ధిల్లాన్, రాజు హిరాణి, అభిజిత్ జోషి కథను అందించారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌తోపాటు తాప్సీ పొన్ను, వికీ కౌశల్, విక్రమ్ కోచ్చర్, అనిల్ గ్రోవర్ తదితరులు నటించారు.

డంకీ మూవీ ప్రీమియర్లను గ్రాండ్‌గా నిర్వహించేందుకు షారుక్ అభిమానులు రంగంలోకి దిగారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో 240 నగరాల్లో ప్రీమియర్లు, అలాగే ఓవర్సీస్‌లో 50కిపైగా నగరాల్లో ప్రీమియర్లను ఏర్పాటు చేస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రీమియర్లను ప్రదర్శించేందుకు అభిమానులే బాధ్యత తీసుకొన్నారు. వారాంతం వరకు సుమారుగా 750కిపైగా షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో ఈ సినిమా భారీ ఒపెనింగ్స్ సాధించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

ఇక డంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ యూఎస్‌లో రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. అమెరికాలో తొలి రోజు 367 ప్రాంతాల్లో 1031 షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 7000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటికే ఈ సినిమా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లకు సిద్దమైంది. అయితే మరోసారి బాక్సాఫీస్ వద్ద షారుక్ 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











