Dunki Day 1 Collections షాకింగ్‌గా డంకీ మూవీ కలెక్షన్లు.. షారుక్ స్టామినాకు తగ్గట్టే.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన డంకీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మున్నాభాయ్ ఎంబీబీఎస్, సంజూ, 3 ఇడియెట్స్ లాంటి చిత్రాలను అందించిన రాజ్‌కుమార్ సినిమా కావడంతో ప్రేక్షకుల దృష్టి ఎక్కువగానే ఉంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్, గ్లింప్స్‌కు భారీ స్పందన రావడంతో బిజినెస్‌కు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే జరిగింది. కానీ షారుక్ సినిమాలు పఠాన్, జవాన్ స్థాయిలో జరుగలేదు. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఏ రేంజ్‌లో ఉందనే విషయానికి వెళితే..
డంకీ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే అంటే దాదాపు 150 కోట్ల మేర జరిగింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్ ప్రకారం.. ఈ చిత్రం ఆక్యుపెన్సీ ఇండియాలో 70 శాతం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డంకీ చిత్రానికి సంబంధించి నేషనల్ మల్టీప్లెక్స్‌లో టికెట్ల అమ్మకాలు జోరుగానే సాగాయి. ఈ సినిమా టికెట్లు ఐనాక్స్, పీవీఆర్, మిరాజ్, సినీ పోలీస్ లాంటి స్క్రీన్లలో 300000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 18 కోట్ల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో సాధించింది.
ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో డంకీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. యూఎస్ఏలో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక యూఏఈ, గల్ఫ్ కంట్రీస్, యూకేలో కలిపి మరో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్‌లో తొలి రోజు 2.5 మిలియన్స డాలర్లతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇక డంకీ మూవీ తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద షారుక్ స్టామినాకు తగినట్టుగా కాసులు వర్షం కురిపించలేకపోతున్నది. ఈ సినిమా ఇండియాలో 40 కోట్లకుపైగా షేర్, 60 కోట్ల గ్రాస్ వసూళ్లను అలాగే ప్రపంచవ్యాప్తంగా 70 నుంచి 75 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











